ట్రెండింగ్

New Tolltax: డ్రైవర్లకు గుడ్ న్యూస్ కొత్త టోల్ వసూల్ విధానాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం..!!

Share

New Tolltax: దేశంలో కొత్త విధానం ద్వారా హైవేలపై టోల్ టాక్స్ కలెక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని రద్దు చేసి కొత్త టోల్ వసూలు చేసే విధానం తీసుకురావటానికి రెడీ కావడం జరిగింది. జాతీయ రహదారుల లో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే.. ఎక్కువ ధరలు డ్రైవర్ ల దగ్గర నుండి ఫాస్ట్ ట్యాగ్ విధానం ద్వారా టోల్ వసూలు చేసే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానం ద్వారా టోల్ వసూలు పద్ధతిని క్యాన్సిల్ చేసి.. కొత్త విధానాన్ని తీసుకురావటానికి సన్నద్ధం అయ్యింది.The good news for drivers central government launching new toll collection system

విషయంలోకి వెళితే శాటిలైట్ నావిగేషన్ సిస్టం తీసుకువచ్చి దానిద్వారా వాహనదారులు నుండి టోల్ ఫీ కలెక్ట్ చేయడానికి రెడీ కావడం జరిగింది. యూరప్ దేశాలలో ముఖ్యంగా జర్మనీ.. రష్యా వంటి దేశాలలో ఈ విధానం విజయవంతం కావడంతో.. ఇండియాలో కూడా ఉపగ్రహ నేవిగేషన్ సిస్టం తీసుకురావడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విధానం ద్వారా వాహనదారులకు టోల్ వసూలు తగ్గే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 97% వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్ విధానం ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు.

The good news for drivers central government launching new toll collection system

ఈ క్రమంలో శాటిలైట్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం సన్నద్ధం కావడం మాత్రమే కాదు.. ఆ విధానాన్ని అమలు చేసే ముందు రవాణా విధానాన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం శాటిలైట్ నావిగేషన్ సిస్టం ద్వారా టోల్ వసూలు.. చేసే విధానాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 1.37 లక్షల వాహనాలకి కేంద్రం వర్తింపజేసి ఉంది. ఈ క్రమంలో రష్యా, దక్షిణ కొరియాకు చెందిన నిపుణులు.. శాటిలైట్ నావిగేషన్ సిస్టం విధానాన్ని అధ్యయనం నివేదికను రెడీ చేస్తున్నారు. సక్సెస్ అయితే మాత్రం ప్రతి వాహనంలో శాటిలైట్ నావిగేషన్ సిస్టం ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులకు టోల్ వసూలు విషయంలో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని అంటున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : నోయల్ ఆరోగ్యం కి అసలేమైంది..? ఇంతకీ వెనకున్న ఆ రహస్యం ఏమిటి….

arun kanna

L.Ramana: బిగ్ బ్రేకింగ్ః టీఆర్ఎస్‌లోకి ఎల్.ర‌మ‌ణ‌…

sridhar

హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన స‌ర్టిఫికెట్లు.. భయం వద్దంటున్న స‌బితా!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar