The Indian court case for grandchildren: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు కన్న కొడుకు విషయంలో న్యాయస్థానంలో వేసిన పిటిషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మేటర్ లోకి వెళ్తే సంవత్సరంలోగా పిల్లలు కంటే సరి లేదా పరిహారంగా 5 కోట్లు చెల్లించాలని ఆ వృద్ధ దంపతులు కొడుకు కోడలికి అల్టిమేటం ఇచ్చారు. పూర్తి విషయంలోకి వెళితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎస్ ఆర్ ప్రసాద్ దంపతులు 2016 సంవత్సరంలో తమ ఏకైక కుమారుడికి ఘనంగా పెళ్లి చేశారు.
అయితే ఇప్పటిదాకా పిల్లల్ని కనలేదు. ఆడ, మగ అనే తేడా లేదు..ఎవరో ఒకరిని కనిస్తే చాలు అంటూ ఆ వృద్ధ జంట తమ బాధను వెళ్లబుచ్చుకున్నారు. ఇక ఇదే సమయంలో పిల్లలు లేకపోతే డబ్బులు అని అనటానికి గల కారణం గురించి కూడా.. వృద్ధ దంపతుల లాయర్ తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే..” మా దగ్గర ఉన్నది అంతా మా అబ్బాయి కోసమే ఖర్చు పెట్టడం జరిగింది. అమెరికాలో ఉన్నత చదువులు చదివించాం. ఆ తర్వాత బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టాం.
మా కొడుకు కోడలు అమెరికాలో స్థిరపడిపోయారు. ఎక్కడ చూస్తే నెలనెలా బ్యాంకు ఈఎంఐ కట్టాలి. ఆర్థికంగా అన్ని విధాల చితికిపోయి ఉన్నాం. బతకటం రోజురోజుకీ కష్టమైపోతుంది. నెలనెల EMI లు కట్టడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందువల్లే కుమారుడు కోడలు సంవత్సరంలో ఒక బిడ్డను కనాలని అల్టిమేటం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో 2.5 కోట్ల రూపాయలు చొప్పున ఇద్దరు ఐదు కోట్ల రూపాయలు పరిహారంగా ఇప్పించాలని.. ఉత్తరాఖండ్ ఎస్సార్ ప్రసాద్ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఎస్ఆర్ ప్రసాద్ తరుపున వాదించే లాయర్ ఏకే శ్రీవాస్తవ కూడా తెలియజేయడం జరిగింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కనీస అవసరాలను పిల్లలు కచ్చితంగా తీర్చాలని శ్రీవాస్తవ మీడియాతో స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొన్న తాజా పరిస్థితులకు అద్దం పడుతున్నది అని కూడా తెలియజేశారు.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…