ట్రెండింగ్

Gangavva: గంగవ్వ చేసిన పనికి మెచ్చుకొన్న సొంత ఊరు జనాలు..!!

Share

Gangavva: తెలంగాణ యాసతో… యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన గంగవ్వ .. అందరికీ సుపరిచితులే. తన మాట తీరు మరియు కామెడీ టైమింగ్ తో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనకంటూ గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఫేమస్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. అనారోగ్యం కారణంగా ఐదో వారంలోనే … తనకు తానుగా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ షో తో గంగవ్వ కు మరింత క్రేజ్ ఏర్పడింది. హౌస్ లోకి వచ్చిన సమయంలో సొంత ఇల్లు కూడా లేని… గంగవ్వ ఆ తర్వాత.. చాలా మంది అభిమానం సంపాదించి.. సొంత ఇల్లు కట్టుకుంది. ఈ ఇంటికి నిర్మాణం విషయంలో యాంకర్ నాగార్జున కూడా సహాయం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సొంత ఊరు లో గంగవ్వ చేసిన పనికి జనాలు జై కొడుతున్నారు. మేటర్ లోకి వెళ్తే… తాను ఉండే గ్రామానికి బస్సు సర్వీసు… వచ్చేలా.. ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి విషయంలో కీలక పాత్ర పోషించింది.

Gangavva: శభాష్ గంగవ్వ.. సొంతూరికి ఆర్టీసీ బస్సు తీసుకొచ్చిన యూట్యూబ్ స్టార్ | Bigg Boss Fame, YouTube star Gangava initiative bus service lambadipally | TV9 Telugu

మేటర్ లోకి వెళ్తే కరోనా కారణంగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా..మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామంలో రెండు సంవత్సరాల నుండి బస్సు సర్వీస్ రావటం లేదు. దీంతో గ్రామస్తులు మరియు వ్యవసాయదారులు కూలీలు విద్యార్థులు… జిల్లా కేంద్రానికి వెళ్ళటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామంతో ప్రైవేటు వాహనాలలో పట్టణాలకు వెళ్లాల్సివస్తే చార్జీలను భారీగా జనాల వద్ద వసూలు చేస్తున్నారు. దీంతో ఇదే గ్రామంలో గంగవ్వ ఉంటూ ఉండటంతో… స్థానిక ప్రజా ప్రతినిధులను తమ సమస్యలను పరిష్కరించాలని.. ఆమె ఇటీవల కలవడం జరిగింది.

How a village grandmother became a YouTube sensation - CNN

ఎంటర్టైన్మెంట్ రంగంలో తిరుగులేని క్రేజ్ ఉండటంతో లంబాడి పల్లికి చెందిన గ్రామస్తులంతా కలసి గంగవ్వ తో మాట్లాడి సహాయం కోరడంతో ఆమె అధికారులను సంప్రదించింది. దీంతో ఆమెకు ఉన్న క్రేజ్ మొత్తం ఉపయోగించడంతో లంబాడిపల్లికి బస్సు సర్వీసును అధికారులు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుండి 5 ట్రిపులుగా… ఆర్టీసీ సేవలందిస్తూ ఉంది. బస్సు మళ్లీ తమ గ్రామానికి రావడంతో లంబాడిపల్లికి చెందిన గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కీలకంగా వ్యవహరించిన గంగవ్వ ని మెచ్చుకుంటున్నారు.


Share

Related posts

మొదలైన నిహారిక ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..!

Teja

బిగ్ బాస్ 4 : అరియానా అతనిని కౌగిలింతలతో కట్టిపడేసింది..! ఇది లవ్వేనా? ఎంతైనా బోల్డ్ పాప కదా

arun kanna

బిగ్ బాస్ 4: టాస్క్ ల విషయములో నెగిటివిటీ..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar