Will Smith Slapping Chris Rock Oscars 2022: ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో.. వేదికపై కమెడియన్ క్రిస్ రాక్ నీ హీరో విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విల్ స్మిత్ భార్య జాడ నీ ఉద్దేశించి సరదాగా క్రిస్ రాక్ కామెడీ చేయటంతో.. అక్కడే ఉన్న విల్ స్మిత్ అందరు చూస్తుండగానే ఆస్కార్ వేదిక పై క్రిస్ నీ చేయి చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన చాలా విమర్శనాత్మకంగా మారింది. విల్ స్మిత్ పై తీవ్రస్థాయిలో హాలీవుడ్ నుండి మిగతా సినిమా ప్రపంచం నుండి విమర్శలు వచ్చాయి. ఇక ఇదే సమయంలో ఆస్కార్ అవార్డుల అకాడమీ 10 సంవత్సరాల పాటు విల్ స్మిత్ పై వేటు వేయడం జరిగింది. అకాడమీ అవార్డుల కార్యక్రమాలకు హాజరు కాకూడదని… వర్చువల్ గా కూడా పాల్గొనకూడదని కఠిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో విల్ స్మిత్ చేయాల్సిన భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా చేజారిపోయాయి. కెరియర్ పరంగా.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విల్ స్మిత్ ఇప్పుడు గొడవ మొత్తానికి కారణమైన భార్య జాడా పింకెట్ట్ స్మిత్ ఈ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఆమెకు విడాకులు ఇవ్వడానికి విల్ స్మిత్ డిసైడ్ అయ్యారట. ఆమె వల్ల తన కెరియర్ డేంజర్ జోన్లో పడటం మాత్రమే కాదు.. గత కొన్ని సంవత్సరాల నుండి ఇద్దరిమధ్య పెద్దగా మాటలు లేకపోవటంతో.. ఒక్కసారిగా ఇప్పుడు పరిస్థితి మరింతగా కఠినంగా మారటంతో విల్ స్మిత్… జాడ కి విడాకులు ఇవ్వడానికి రెడీ అయినట్లు లాయర్లతో మాట్లాడుతున్నట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ విడిపోవాల్సి వస్తే విల్ స్మిత్.. తన భార్యకి 350 మిలియన్ల డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.