జాగింగ్ కి వెళ్లి కోట్లు సంపాదించిన యువకుడు.. ఏం జరిగిందంటే?

పార్క్ కు వెళ్తే ఎవరైనా కోటీశ్వరుడు అవుతారా అని ఆశ్చర్యం వెయ్యచ్చు. కానీ నిజంగానే ఓ వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి.. అతడు రోజులనే స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ అతడికి ఓ వజ్రం దొరికి ఒక్క రోజులో కోటీశ్వరుడు అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 

ఆ పార్కులో ఒకప్పుడు విలువైన వజ్రాలతో ఉండేదట. అక్కడికి వచ్చిన సందర్శకులు అక్కడ వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారట. కానీ ఒక వ్యక్తికి ఎలాంటి వెతికే పని లేకుండా సులువుగా వజ్రం దొరికింది. అది ఎలానంటే అతను తన స్నేహితులతో కలిసి పార్కులో తిరుగుతున్న సమయంలో ఓ మెరుస్తున్న రాయి దొరికింది. అది అతడికి ఆకర్షించడంతో ఆ రాయిని తీసుకున్నాడు కానీ తాను తీసుకుంది రాయి కాదు విలువైన వజ్రం అని తెలిశాక ఆశ్చర్యంతో గంతులేశాడు.

ఆ వ్యక్తి పేరు “కెవిన్ కినార్”. తను ఆర్కన్సాస్ లోని మౌమెల్లేలో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అతడికి చిన్నప్పటి నుంచి “క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్” పార్కులో కాలక్షేపం చేసే అలవాటు ఉంది. అక్కడ వజ్రాలు దొరుకుతాయి అని అతనికి తెలిసిన వాటికోసం ఎప్పుడు వెతకలేదు. అక్కడ కేవలం కాలక్షేపం చేయడానికే వెళ్ళేవాడు. ఇంత అలానే ఆరోజు వెళ్లగా అతడికి అనుకోని రీతిలో వజ్రం దొరికింది.

ఇక ఆ రాయిని డైమండ్ డిస్కవరీ సెంటర్ వద్ద ఇచ్చారు. ఇది పార్క్ బయటే ఉంటుంది. ఇక అందులో వజ్రాలు ఉన్నట్లయితే వివరాలు నమోదు చేసి తిరిగి సందర్శకులకు ఇచ్చేస్తారు. అలాగే కెవిన్ కూడా అతడి దగ్గరున్న గాజు రాయిని పరీక్షించడానికి నిపుణులకు ఇవ్వగా వాళ్ళు దాన్ని పరీక్షించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అది ఆ పార్కులోనే 9.07 క్యారెట్ల బరువున్న రెండవ అతి పెద్ద వజ్రం. దీని విలువ కొన్ని కోట్ల రూపాయిలు ఉంటుందని ఆశ్చర్యపోయారు. ఈ ఘటనతో కెవిన్ ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యాడు.