Snacks: హెల్తీ స్నాక్స్ ఇవే.. లాగించేయండి..!!

Share

Snacks: స్నాక్స్ తినకుండా ఏ రోజు పూర్తి కాదు.. స్నాక్స్ లేకుండా ఏ సాయంత్రము సంపూర్ణం కాదు.. అన్ని రకాల స్నాక్స్ తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదు.. మంచి పోషక విలువలు ఉన్న స్నాక్స్ తింటే మన ఆరోగ్యం పదిలం గా ఉంటుంది.. అటువంటి హెల్తీ స్నాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

These are healthy Snacks: benefits
These are healthy Snacks: benefits

Snacks: ఈ స్నాక్స్ తింటే ఆరోగ్యానికి మేలు..!!

వేయించిన పల్లి – బెల్లం:
మనం సాయంత్రం తీసుకునే స్నాక్స్ లో వేయించిన వేరుశనగలు, బెల్లం ది కీలకపాత్ర.. వీటిలో లో ఉండే విటమిన్స్ మినరల్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బెల్లం లో ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్స్, సెలీనియం ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ స్నాక్ ను తినవచ్చు. బెల్లం తినడం వలన మధుమేహులకు ఎటువంటి హానీ జరగదు. మరో స్నేక్ మరమరాలు, వేయించిన పల్లీలు, టమాటా, కొత్తిమీర, నిమ్మకాయ రసం కలిపి సాయంత్రం తింటే ఆ మజానే వేరు..

These are healthy Snacks: benefits
These are healthy Snacks: benefits

అటుకులు బెల్లం లేదా పటిక బెల్లం కలుపుకుని తింటే ఆ రుచే వేరు.. అలాగే మరమరాలు, బెల్లం కూడా చాలా మంచివి. సెనగలు, బెల్లం ముక్క మన చిన్నప్పుడు ఇష్టంగా లాగించేసే వాళ్ళం.. ఈ రుచి మన పిల్లలకి పరిచయం చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు.. పైగా ఆరోగ్యం కూడా.. బఠాణిలు, శనగలు స్కూల్ కి వెళ్లేటప్పుడు 5 రూపాయలు పెట్టి కోనుకొని జేబు నిండా నింపుకొని సాయంత్రం వరకు వాటిని తింటూ ఉండే వాళ్ళం.. వీటి పక్కన బజ్జీ, వడాపావ్, పానీపూరి దీన్ని పక్కన ఉఫ్.. మన బామ్మలు మన చిన్నప్పుడు ఇవే మనకు స్నాక్స్ గా పెట్టేవారు.. నేటి తరం పిల్లలకు ఇవి పెద్దగా పరిచయం లేవూ.. వారి ఊరికి పిజ్జా, బర్గర్, శాండ్ విచ్, బంగాళాదుంప చిప్స్ బాగా తెలుసు..

These are healthy Snacks: benefits
These are healthy Snacks: benefits

డ్రై ఫ్రూట్స్ అన్నిటికంటే అంటే బెస్ట్ స్నాక్స్ గా చెప్పవచ్చు.. డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కలిపి తినవచ్చు.. లేదంటే మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్ ను ఎంచుకొని తీసుకోవచ్చు. వీటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ మన రోగనిరోధక శక్తిని పెంపొందించి మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

These are healthy Snacks: benefits
These are healthy Snacks: benefits

పండ్లు ఎప్పుడు తిన్న ఆరోగ్యమే.. రోజుకు ఒక పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లడం అవసరం లేదుని అందరికీ తెలిసిన విషయమే.. రోజు సాయంత్రం పూట మీకు నచ్చిన పండు ను తినండి. లేదంటే రకరకాల పండ్లను కలుపుకొని ఫ్రూట్ సలాడ్ లా చేసుకొని తింటే అన్ని రకాల పండ్లలో ఉన్న పోషకాలు ఒకేసారి మన శరీరానికి అందుతాయి.. సాయంత్రం స్నాక్స్ గా అప్పుడప్పుడు మొలకలు తినడం పిల్లలకు అలవాటు చేయాలి. ఎందులో లేనన్ని పోషకాలు మొలకలలో ఉంటాయని గుర్తుంచుకోవాలి.

అదే వాన కాలంలో అయితే పకోడీలు, బజ్జి, సమోసా అంటూ నూనెలో వేయించిన పదార్థాలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి తింటే బాగానే ఉంటుంది. కానీ ఎక్కువగా తినటం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. వీటికి బదులు చక్కగా అప్పటికప్పుడు కాల్చిన మొక్కజొన్న తినండి..


Share

Related posts

ఇక రకుల్ ని ఆపే సత్తా ఎవరికీ లేదు.. టైం అలా కలిసొస్తోంది..!

GRK

అంబటి రాంబాబు మీద బిగ్ కుట్ర .. జగన్ వరకూ వెళ్ళిన మ్యాటర్ ?

sridhar

జియో వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ సేవలన్నీ ఫ్రీ!

Teja