Rice: ఒకప్పుడు కడుపునిండా తింటే ఆరోగ్యం.. ఇప్పుడు కడుపునిండా తింటే అనారోగ్యం.. దానికి కారణం మన ఆహారపు అలవాట్లు.. మనం తీసుకునే ఆహారమే.. అన్నం తినకుండా సులువుగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. మధుమేహులు రాత్రి పూట అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చింతిస్తున్నారా..!? వీటిని ట్రై చేయండి..!!
చిరుధాన్యాల కు మించిన ఆహారం లేదంటే అతిశయోక్తి కాదు.. రాగులు, సజ్జలు, కొర్రలు, ఊదలు, సాములు ఈ చిరుధాన్యాలతో రక రకాల ఆహార పదార్ధాలు రుచికరంగా తయారు చేసుకుని ఉండవచ్చు. కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి చిరుతిళ్ళ జోలికి వెళ్లరు. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కేలరీలు తక్కువ వీటిని తింటే బరువు నియంత్రణలోకి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. మొదటిలో మిల్లెట్స్ ను అలవాటు చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ముందు ఒక పూట తినడానికి ప్రయత్నిస్తూ నిదానంగా రెండు పూటలా తినేలా అలవాటు చేసుకోండి.
డాలియా ఇది అన్నానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇందులో లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అన్నానికి ప్రత్యామ్నాయంగా క్వినోవా చెప్పుకోవచ్చు. ఇందులో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, ఫైటో న్యూట్రియంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. మరొక ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక లో బార్లీ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. వైట్ రైస్ తో పోలిస్తే ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కడుపు నింపడం తో పాటు ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?