ఆర్ఆర్ఆర్ లో ఉన్న వీటి గురించి వింటే ఫ్యాన్స్ కి పూనకాలే….

ప్రస్తుతం టాలీవుడ్ ప్రజానీకం మొత్తం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం పైనే దృష్టి పెట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతుంది.

 

ఇక కథ విషయంలో రాజమౌళి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి – విజయేంద్రప్రసాద్ ప్రతి పాయింట్ విషయంలో ఆచితూచి అడిగేస్తారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అంతే ఈ విధంగా నడుచుకుంటున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆర్ఆర్ కథ గురించి రకరకాల ఊహాగానాలు తెలిపారు. ఇక రామ్ ఫ్యాన్స్… భీమ్ ఫ్యాన్స్ అని విడిపోయి డిబేట్ కి దిగారు. ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

ఈ సినిమా కథాంశం లో రామ్ vs భీమ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను రక్తి కట్టిస్తూ సినిమా గ్రాఫ్ ను ఆమాంతం లేపేస్తాయని అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళతో పోలీస్ అధికారిగా విద్యాధికుడిగా సీతారామరాజు పనిచేస్తుంటారు. ఇక అదే సమయంలో మాస్ లీడర్ అయిన గిరిజన నాయకుడు కొమరం భీమ్ ని అరెస్ట్ చేస్తాడట. ఆ తర్వాత బ్రిటిష్ వారికి ఎదురు తిరిగే క్రమంలో ఒకే సన్నివేశంలో ఇద్దరూ కలిసిపోతారని అప్పటివరకూ ఆ ఇద్దరి మధ్య పోరు సాగుతుంది అని అంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే క్రమంలో ఇద్దరూ కలుస్తారని చెబుతున్నారు.

గిరిజన తండా నుండి కొమరం భీమ్ గెటప్ లో ఎన్టీఆర్ ఫైట్స్ మాస్ గా ఉండి ప్రేక్షకులను కట్టిపడేస్తాయంటున్నారు. అతడు ఆంగ్లేయులపై ఒక రేంజ్ లో విరుచుకు పడతాడు అని అంటున్నారు. ఇక రెండు పాత్రలకి ఉద్వేగభరిత క్షణాలు కూడా జోడించారు. ఇంటెర్వెల్ లో చేసే పోరాటం పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్-పులి ఫైట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారట. ఇక ఇవి చరిత్రాత్మక పాత్రలు కావడంతో కథాంశం దాదాపు అందరికీ తెలిసిందే. కథ ని కూడా ఇదే అంటూ అంతర్జాలంలో సర్కిల్ చేస్తున్నారు.

ఇక నెటిజన్లు ఊహించి రాసింది కొంత అయితే ఇంచుమించు లీక్ అయిన ఫోటోలు నుండి మిగతాది రాస్తున్నారని అర్థమవుతోంది. మొత్తానికి ఇదే అసలు కథ అంటే…. ఇదే కథ అని వారు వాదిస్తున్నారు. మరికొందరు ఈ కాలమానానికి తగ్గట్టు కథను రాజమౌళి రూపొందిస్తున్నారని అన్నీ వాదనలను కొట్టిపారేస్తున్నారు