Featured ట్రెండింగ్ న్యూస్

Surprise Girl Pushpa: పుష్ప కేసులో ఫైనల్ ట్విస్ట్ ఇదే..! షాకింగ్ కారణం..!?

Share

Surprise Girl Pushpa: Surprise Girl Pushpa అందరికీ తెలుసు. అనకాపల్లి జిల్లాలో మూడు రోజుల కిందట జరిగిన దారుణంతో ఈ యువతీ తెరపైకి వచ్చింది. కాబోయే భర్తని గిఫ్ట్ ఇస్తానంటూ దూర ప్రాంతానికి తీసుకెళ్లి పీక కోసేసిన దుర్ఘటన దేశం మొత్తం చూసి నివ్వెరపోయింది. అప్పటి నుండి ఈ యువతీ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈమెను అరెస్టు చేయగా.., ప్రస్తుతం సబ్ జైలులో ఉంటుంది. ఇంతకు పుష్ప ఎందుకు ఇలా చేసింది..!? ఈ ఘాతుకానికి ఎందుకు ఒడిగట్టింది..? ఆమె వెనుక బలమైన కారణాలు ఏమున్నాయి..? ప్రేమ వ్యవహారం కారణమా.., ఇంకేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా వెలికితీయగా ఒక షాకింగ్ కారణం బయటపడింది..!

This is the final twist in the pushpa case Shocking reason
This is the final twist in the pushpa case Shocking reason

Surprise Girl Pushpa: ప్రేమ కాదు.. కానీ..!

Surprise Girl Pushpa: పుష్ప వయసు 22.. భక్తి భావం ఎక్కువ. చలాకీగా ఉంటుంది. తరచూ ఆలయాలకు వెళ్తుంది. తమ ఊరికి దగ్గర్లోనే ఒక మఠం ఉంది.. అక్కడకు కూడా తరచూ వెల్తూ ప్రవచనాలు వింటుంది.. ఇదే పుష్ప జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఆశ్రమంలో చెప్పే వైరాగ్య, జీవిత వేదాంతాన్ని, ప్రవచనాలను విన్న పుష్ప వాటిని ఆపాదించుకోవడం మొదలు పెట్టింది. వివాహ జీవితంపై విరక్తి పెంచుకుంది. తరచూ తన స్నేహితురాళ్లు దగ్గర, బంధువుల దగ్గర ఇదే విధంగా మాట్లాడడం మొదలు పెట్టింది.. దీంతో ఆశ్చర్యపోయిన పుష్ప తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేయాలని నిర్ణయించారు.. అందుకే ఆమెకు గత మూడు నెలల నుండి వరుసగా సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. మొదటి రెండు సంబంధాలు బాగున్నప్పటికీ పుష్ప నిరాకరించింది. ఏవేవో కారణాలు చెప్పి వాటిని చెడగొట్టింది. ఎలాగైనా కుమార్తెకు పెళ్లి చేసేయాలని తలంపుతో ఉన్న తల్లిదండ్రులు మూడో సంబంధంగా రామానాయుడ్ని చూసి, పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలోనే తాను ఎంతగా తిరస్కరిస్తున్నా తల్లిదండ్రులు పదే పదే సంబంధాలు తీసుకొస్తున్నారు కాబట్టి.. తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే.. ఏదో ఒకటి చేయాలని పుష్ప ఆలోచించింది..!

This is the final twist in the pushpa case Shocking reason
This is the final twist in the pushpa case Shocking reason

అందుకే అలా.. ప్రణాళికగా..!!

ఈ క్రమంలోనే పుష్ప, రామనాయుడితో పెళ్ళికి అంగీకరించింది. ఇక పెళ్లి ఏర్పాట్లన్నీ జరగుతున్నాయి. పుష్ప కూడా ఏమాత్రం అనుమానం రాకుండా రామనాయుడుతో మాట్లాడుతూనే ఉండేది. ఈ క్రమంలోనే రామానాయుడ్ని చంపేస్తే తనకు ఇక పెళ్లి సంబంధాలు చూడరు, పెళ్లి అనే మాట ఎత్తరు అనే ఆలోచనతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.. అలా ఒక ఆశ్రమంలో చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకుని.. మైండ్ లో పెట్టేసుకుని.. అత్యంత దారుణానికి పాల్పడింది. ఆ వెంటనే భయంతో తాను కూడా చనిపోవాలి అనుకున్నపటికీ రామనాయుడే తేరుకుని.. అక్కడి నుండి ఆమెను తీసుకెళ్లాడు..! అలా పుష్ప కథలో అసలు కారణం బయటకు వచ్చింది.!


Share

Related posts

తెలుగులో కూడా నెట్ ఫ్లిక్స్ లాంటి యాప్

somaraju sharma

Bigg Boss 5 Telugu: ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు..??

sekhar

Huzurabad By Poll: రేవంత్ – ఈటల మ్యాచ్ ఫిక్సింగా..? బీజేపీ – టీఆర్ఎస్ రహస్య ఒప్పందమా..?

somaraju sharma