Tippa Teega: ఆయుర్వేదం లో ఉండే రకరకాల మూలికలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.. అటువంటి వాటిలో తిప్పతీగ ఒకటి.. తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకులు వైద్య గుణాలున్నాయని ఎక్కువ మందికి తెలీదు.. దీర్ఘకాలిక వ్యాధులకు తిప్పతీగ చక్కటి పరిష్కారం.. ప్రతిరోజు తిప్పతీగ ను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ పాటిస్తారు..
తిప్పతీగ యాంటీఏజింగ్ హెర్బ్. ఇది కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కణాల నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే తిప్పతీగ చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. వృద్ధాప్య సంకేతాలు తగ్గించి కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలను నివారిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థ వృద్ధి చేస్తాయి. ఉబ్బసం, దగ్గు, ఆయాసం, జలుబు, టాన్సిల్స్, శ్వాస సంబంధిత సమస్యలు వంటివి రాకుండా కాపాడుతుంది.
మధుమేహా నివారిణి తిప్పతీగ. ఇది క్లోమం నుండి ఇన్సులిన్ స్రావం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.. న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది కాలేయాన్ని రక్షిస్తుంది తిప్పతీగ ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?