అమ్మాయిలను తమ వైపు ఆకర్షించాలంటే ఇలా చేయాలి.. అలా చేయాలని అందరూ చెబుతుంటారు. కానీ… తనకు నచ్చిన అబ్బాయిని తనవైపు తిప్పుకోవడం ఎలా అనే విషయం మాత్రం.. అమ్మాయిలకు ఎవరూ సలహా ఇవ్వరు.అయితే.. దీనిపై ఒ సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కొంత మంది యువకులపై చేసిన సర్వేలో.. వాళ్లు.. తమను ఇలా ఇంప్రెస్ చేసిన అమ్మాయిల వైపే మొగ్గు చూపుతాతమంటూ చెప్పడం విశేషం. అవేంటో మీరు తెలుసుకోండి.
పొగడితే అమ్మాయిలే కాదు..అబ్బాయిలు కూడా ఈజీగా పడిపోతారు. కాకపోతే ఆ పొగడ్త వారికి సహజం గా నిజం అని నమ్మేలా అనిపించాలి. అలా కనుక పొగిడితే, వాళ్లు ఇక మీకు దాసోహం అయిపోయినట్టే అంటున్నారు నిపుణులు. అవి ఎలాంటి పొగడ్తలో ఇప్పుడు చూద్దాం .. అమ్మయిలకే కాదు శరీర సౌష్టవం గురించి పొగిడించుకోవడం అంటే అబ్బాయి ల కు బాగా ఇష్టం. మీకు కుదిరినప్పుడల్లా అతడి అంగాంగ సౌష్టవాన్ని మెచ్చుకోండి. అతడి కండరాలు ఎత్తైన ఛాతీ ఆకారానికి తగిన కితాబివ్వండి. మగవాళ్లు కొత్త, ట్రెండీ హెయిర్స్టైళ్లను ఫాలో అవ్వాలనుకుంటారు. చిన్నగా, ట్రిమ్ చేసుకున్నా, లాంగ్ హెయిర్ పెంచినా తమదైన శైలిలో ఉంటారు. షూస్ ను గమనించి దాని గురించి మెచ్చుకుంటే అబ్బాయిలు బాగా ఇష్టపడతారు. చాలా మందికి తాము మంచి షూస్ వేసుకొని అందరూ గమనించాలని కోరుకుంటారు. అమ్మాయిలు మీ కోసమే అబ్బాయిలు నీట్‌గా రెడీ అయ్యేది! మరి కాస్త వారిని ఓ లుక్ వేసి మెచ్చుకోండి. అమ్మాయి లు ఎంతసేపు మీ పొగడ్తలగురించే కాదు అప్పుడప్పుడు అబ్బాయిల పొగడ్తల గురించి కూడా కాస్త ఆలోచించండి. రిలేషన్షిప్ లో కొనసాగుతున్నవారైతే అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటే, ఆ విషయం మీరు గమనిస్తున్నారన్నది అతడికి అర్థమవ్వాలి. మగవాళ్లు పైకి కనిపించే అంత కఠినంగా ఉండరు. లోపల చాలా మృదుస్వభావులు. కానీ దాన్ని ప్రపంచానికి చూపించాలనుకోరు. వారి ఎమోషనల్ ఫీలింగ్స్‌ను పొగిడేటప్పుడు నిజాయతీగా వ్యవహరించండి. సెన్సాఫ్ హ్యుమర్ ప్రతి నలుగురు మగాళ్లలో ఒకరికి మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉంటుందంట. మీ ప్రియుడు అలాంటివాడైతే నిజంగా మీరు చాలా అదృష్టవంతులే. ఆ విషయాన్ని కూడా మీరు వాళ్లకి తెలియజేస్తూ ఉండాలి. ఆలా తెలియచేయడం వలన మీరు మరింత ఆనందం గా ఉండడానికి ఉపయోగ పడుతుంది.