NewsOrbit
ట్రెండింగ్

 మీ ఫేవరెట్ చీరల్ని ఇలా జాగ్రత్త పరచుకోండి అమ్మాయిలూ ..

 మీ ఫేవరెట్ చీరల్ని ఇలా జాగ్రత్త పరచుకోండి అమ్మాయిలూ ..

ఆడవాళ్లు ఎక్కువగా శుభకార్యాల వేళ పట్టు బట్టలు ధరించడానికి ఇష్టపడతారు. అయితే..పార్టీలకు వెళ్ళి వచ్చిన తర్వాత పట్టుచీరను వెంటనే మడతపెట్టి దాచి వేయకూడదు. కాసేపు గాలి తగిలేలా ఆరబెట్టి వుంచాలి. సాధారణంగా పట్టు బట్టలమీద మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు.  అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బుపోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల భద్రపరిచే  విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.

 మీ ఫేవరెట్ చీరల్ని ఇలా జాగ్రత్త పరచుకోండి అమ్మాయిలూ ..

పట్టుచీరలను ఉతకడానికి ఎప్పుడూ గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. పట్టుచీరలను చెరువు, నది నీటితోనే ఉతకాలి. బోరునీటితో ఉతికేవారు ఆ నీటిలో చిటికెడు బోరాక్స్ కలపాలి. నాణ్యమైన, తేలికపాటి సబ్బును ద్రవ లేదా పొడి రూపంలో వాడాలి. బోరునీరైతే తేలికపాటి డిటర్జెంట్ వాడాలి. పట్టు బట్టలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి నీడ పట్టున ఆరేయాలి.బాగా గట్గిగా పిండకూడదు. పట్టు బట్టల మీద ఇంక్ లేదా లిప్‌స్టిక్ మరకలు పడితే ఆ భాగంలో పేపర్ టవల్‌ను ఉంచి వెనుకనుంచి డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్‌ పూయాలి. మరక పూర్తిగా పోయేవరకు నీటిని వాడరాదు. పట్టు బట్టల మీద కాఫీ లేదా టీ మరకలు పడితే కార్బన్ టెట్రాక్లోరైడ్ ను పూస్తే మరకలు పోతాయి. అప్పటికీ పోకపోతే వేడినీటిలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ వేసి ఆ నీటితో ఉతకాలి. అదే..పెరుగు, వెన్న వంటి మరకలు పడితే ఆ భాగంలో ఒక చుక్క కార్బన్ టెట్రాక్లోరైడ్‌ని ఉపయోగించాలి. అదే నెయిల్ పాలిష్ పడితే ఆ భాగం వరకు అసిటోన్‌ లో ముంచితే సరిపోతుంది. పట్టు బట్టల మీద చాక్‌లెట్ మరకలు పడితే వేడి నీటిలో జాడించి ఉతికితే పోతాయి.షూ పాలిష్ మరకలు పడితే కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రుద్ది ఆ తర్వాత ఆల్కహాల్ పూయాలి.

బురద మట్టి మరకలు పడితే పట్టు వస్త్రాన్ని ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్ తో తుడిచి ఉతికితే సరిపోతుంది. అలాగేపట్టుబట్టలను ప్లాస్టిక్ సంచుల్లో గాక పేపర్ లేదా కాటన్ సంచుల్లోనే ఉంచాలి. పట్టుబట్టలున్న చోట ఎక్కువ గాలి, కాంతి లేకుండా చూడాలి.పట్టు బట్టలను చెక్క లేదా కలపతో చేసిన పెట్టె లేదా బీరువాలో నేరుగా తాకేలా గాక కవరులో పెట్టి పెట్టాలి.చీరలను బీరువాలో భద్రపరిచే సమయంలో కలరా గోళీల కాకుండా గంధపు చెక్క ముక్కలు గుడ్డలో చుట్టి పెట్టుకోవాలి. ఒకవేళ గంధం చెక్క లేకపోతే  మిరియాలను ఒక వస్త్రంలో చుట్టి చీరల మధ్యలో ఉంచినా చీరలకు తేమ చేరకుండా ఉంటుంది. పట్టు బట్టలను అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి. లేకుంటే మడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది. అందుకే పట్టు బట్టల విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి అప్పుడే.. అవి పదికాలాల పాటు మన్నికగా ఉంటాయి. మీరు మీ పట్టు చీరలను సరిగ్గా నిల్వ చేసి, నిర్వహిస్తే, కొన్ని సంవత్సరాల పాటు మీరు వాటి మెరుపును కొత్తదనాన్ని అలానే కొనసాగించవచ్చు. ఆలా చేయడం వలన మీరు వాటిని రాబోయే భవిష్యత్ తరాలకు కూడా అందించవచ్చు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju