Today Gold Rate : (18/4/2021) బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఝలక్.. మళ్లీ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలు ఇప్పటి వరకు అదే స్పీడులో కొనసాగుతోంది.. కానీ ఈ మధ్య మధ్యలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా.. మొత్తం మీద పరిశీలిస్తే పెరుగుదల ఎక్కువగానే ఉంది. గత పది రోజుల్లో బంగారం ధరలు ఏడు సార్లు పెరగగా.. మూడుసార్లు మాత్రమే తగ్గాయి..
ఈ 17 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పై మూడు వేల వరకు పెరిగింది.. 24 క్యారెట్లు ఉన్న 10 గ్రాముల బంగారం మూడు వేలకు పైగా పెరిగింది.. ఈ లెక్కన చూస్తే తగ్గుదల కంటే పెరుగుదల ఎక్కువగా ఉంది.. తాజాగా ఈ రోజు బంగారం ధరలు కూడా పెరిగాయి.. బంగారం ధరలు పెరుగుతాయా అంటే.. పెరగవచ్చు అంటున్నారు విశ్లేషకులు.. దేశంలో కరోనా తగ్గేవరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చు అంటున్నారు మార్కెట్ నిపుణులు..
ఆదివారం హైదరాబాద్, బెంగళూర్, కేరళ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి రూ.150 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,150 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.160 పెరిగింది. దీంతో ఈరోజు రేటు రూ.48,160 కి చేరింది.. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా అదే బాట పయనించింది.. నిన్నటి ధర కి ఏకంగా రూ. 300 పెరిగింది. ఈరోజు కేజీ వెండి ధర రూ. 73,700 కి చేరింది ..