Today Gold Rate: జిగేల్ మంటున్న బంగారం, వెండి ధరలు.. ఆల్ టైమ్ గరిష్టస్థాయికి

Share

Today Gold Rate: (27/5/2021) పసిడి ప్రియులకు ఝలక్.. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. బంగారం ధర కొండెక్కింది.. పసిడి ధర జిగేల్ మంటోంది.. వరుసగా ఐదు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలకి ఈరోజు రెక్కలొచ్చాయి.. బంగారం ధర తో పాటు వెండి ధర కూడా పెరిగింది.. పసిడి ధర 50 వేలకు పెరిగి ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది.. వెండి ధర కూడా భగ్గుమంటోంది.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price Hike
Today Gold Rate: and silver price Hike

Read More : పేర్లు ఉండవు.. విజిల్ వేసి పిలవాలి.. ఇదో వెరైటీ ఊరు..!!

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి ఏకంగా రూ.500 పెరిగింది. దీంతో ఈ రోజు రేటు 46,100 కి చేరింది.. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుకి ఏకంగా రూ.540 పెరిగింది.. దీంతో ఈరోజు ధర రూ. 50,300 కి చేరి ఆల్ టైమ్ గరిష్టస్థాయి కి చేరుకుంది. ఏప్రిల్ 1న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,370 ఈరేటుతో ఈరోజు ధర పోల్చుకుంటే ఏకంగా 3,230 రూపాయలు పెరిగింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,370 ఉంది. ఈ ధరతో ఇవాల్టి ధర పోల్చుకుంటే ఏకంగా రూ.5,930 పెరిగింది. 56 రోజులలో బంగారం ధరలో ఎంత మార్పు చోటు చేసుకుందో క్లియర్ గా అర్థం అవుతోంది. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరకి ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి నిన్నటి ధరకి ఏకంగా రూ.1300 పెరిగింది దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.77,300 కి ఎగసింది..


Share

Related posts

Ram Charan: రామ్ చరణ్.. శంకర్ సినిమా షూటింగ్ గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు..!!

sekhar

Mehaboob : మెహబూబ్ కు మంచి ఆఫర్ ఇచ్చిన ఓంకార్? నచ్చిన అమ్మాయికి ముద్దు పెట్టుకోమంటూ?

Varun G

విడిపోయిన మీ జీవిత భాగస్వామి తో మళ్ళీ కలిసి బ్రతకాలనుకుంటున్నారా??

Kumar