Today Gold Rate: (9/6/2021) బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు ఊపందుకున్నాయి.. ఈరోజు బంగారం ధర పైపైకి కదిలింది.. పసిడి ధర జిగేల్ మంటుంది.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి.. నేటి బంగారం వెండి, ధరలు ఈవిధంగా ఉన్నాయి..
Read More: Nikhil- Anupama: నిఖిల్ కు ఆ హీరోయినే బెస్ట్.. ఎందుకంటే..
బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి రూ.100 పెరిగింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.45,900 కి చేరింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 పెరిగింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.50,070 కి చేరింది.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పైపైకి వెళ్ళింది. 0.50 శాతం పైకి అదిరింది దీంతో పసిడి రేటు ఔన్స్ కు 1893 డాలర్లకు ఎగసింది.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు అమాంతం పెరిగింది.. నిన్న రూ.500 తగ్గితే ఈరోజు రూ.500 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,300 కి చేరింది.. అంతర్జాతీయ మార్కెట్ లో వెండి రేటు కూడా పెరిగింది. ఔన్స్ కు 0.50 శాతం పెరుగుదలతో 27.83 డాలర్లకు చేరింది..