Today Gold Rate: (23/5/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలలో ధరలు ఈరోజు కూడా తటస్థం గానే ఉన్నాయి.. ఈరోజు బంగారం ధరలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఈరోజు కూడా బంగారం ధర స్థిరంగా ఉంది.. వరుసగా బంగారం రెండో రోజు బంగారం ధర తటస్థంగా ఉంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం. ఈ విషయంపై మార్కెట్ విశ్లేషకులు ఈ నెలలో 6 సార్లు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఈ ఆరు సార్లు స్థిరంగా ఉన్న ప్రతిసారి రెట్టింపు వేగంతో పెరిగింది.. దేశీయ మార్కెట్ విశ్లేషకులు కూడా బంగారం ధర పెరుగుతుందని చెబుతున్నారు.. మరో మూడు నెలల పాటు బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..
ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600 నిన్నటి రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 వద్ద తటస్థంగా ఉంది.. అయితే బంగారం పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయని గమనించాలి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు ప్రభావం చూపుతాయి. ఒకవైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం దిగివచ్చింది.. వరుసగా 4 రోజులుగా వెండి ధర పడిపోతూ వస్తోంది.. ఈరోజు కూడా వెండి ధర నేలచూపులు చూస్తోంది.. నిన్నటి వెండి ధరకి ఏకంగా రూ.700 తగ్గింది. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.75,700 క్షీణించింది.. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.