Today Gold Rate: (11/8/2021) పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఈరోజు పసిడి ధర స్థిరంగా ఉంది.. నేడు బంగారం ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉండటంతో.. దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర నిలకడగానే ఉంది.. ఒకవైపు బంగారం స్థిరంగా ఉంటే.. మరోవైపు వెండి ధర మాత్రం దిగివచ్చింది.. నేటి బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.43,350 వద్ద నిలకడగా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.47,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. నిన్ను పైపైకి కదిలిన వెండి ధర ఈరోజు దిగివచ్చింది.. నేడు వెండి ధర నేల చూపులు చూస్తోంది.. నిన్నటి రేటుతో పోలిస్తే ఏకంగా రూ.500 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.68,200 కి చేరింది.. దేశీయ మార్కెట్లో వెండి ధర తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి రేటు స్థిరంగా ఉంది.. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు.