Today Gold Rate: (24/4/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. నిన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం ధరలు ఈ రోజు దిగి వచ్చాయి.. బంగారం ధర పడిపోయింది.. పసిడి రేటు వెలవెలబోతోంది.. ఒకవైపు బంగారం ధరలు తగ్గితే.. మరోవైపు వెండి ధరలు పెరిగాయి.. ఈరోజు బంగారం ధరలు తగ్గాయి, వెండి ధరలు మాత్రం పెరిగాయి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ ఇలా ఉన్నాయి..
శనివారం హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, మంగుళూరు, మైసూర్, భువనేశ్వర్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి ఏకంగా రూ.300 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,800 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి ఏకంగా రూ.330 తగ్గింది. దీంతో ఈరోజు రేటు రూ.48,870 కి చేరింది.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు పైపైకి కదిలింది.. నిన్నటి వెండి ధర కి రూ.400 పెరిగింది. దీంతో ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 74,300 కి చేరింది..