Today Gold Rate: (8/7/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు కూడా పైపైకి కదిలాయి.. ఈరోజు బంగారం ధర భగ్గుమంటోంది.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి మాత్రం భారీగా పడిపోయింది.. నేటి బంగారం, వెండి రేట్లు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం రండి..
Read More: KCR: ఆ చెట్టు వద్దకు అధికారులు క్యూ కట్టారు.. ఫోటోలు దిగారు.. విషయమేమిటంటే..
గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే ఏకంగా రూ.250 పెరిగింది. దీంతో ఈరోజు బంగారం ధర రూ.44,650 కి ఎగసింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా 270 పెరిగింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48,710 కి చేరింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్, వైజాగ్, కేరళ, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న పైపైకి కదిలిన వెండి ఈరోజు అమాంతం పడిపోయింది.. ఈరోజు వెండి ధర భారీగా తగ్గింది.. నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.1100 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.74,100 కి క్షీణించింది.. ఈరోజు వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు.