Today Gold Rate: నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. ఈ నెలలో 2 సార్లు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. స్థిరంగా ఉన్న ప్రతి సారి బంగారం ధరలు పెరిగాయి.. అంటే బంగారం ధర పెరుగుదల సూచనలు కనిపిస్తున్నాయి.. దేశీయ మార్కెట్ విశ్లేషకులు కూడా రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు.. నేటి బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే రూ.100 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,750 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.110 పెరిగి రూ.48,820 కి ఎగసింది.. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, కేరళ, భువనేశ్వర్, మైసూర్, మంగళూరు లో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు అమాంతం పడిపోయాయి.. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.700 తగ్గింది. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.73,400 కి చేరింది.