Today Gold Rate: (16/7/2021) బంగారం ధర మెరిసింది.. నిన్న పైకి కాదు రెండు బంగారం ఈరోజు కూడా అదే బాటలో పయనించింది.. పసిడి ధర జిగేల్ మంది.. ఈరోజు కూడా బంగారం ధర పెరగడంతో వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర పెరిగింది.. బంగారం ధర పైకి కదిలితే వెండి కూడా పరుగులు పెట్టింది… నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..
Read More: Oke Oka Jeevitham: ఆకట్టుకుంటున్న ఒకే ఒక జీవితం మోషన్ పోస్టర్..!!
శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.250 పెరిగింది దీంతో ఈ రోజు బంగారం ధర రూ.45,150 కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే రూ.270 పెరిగి రూ.49,260 కి ఎగసింది.. బంగారం ధరల పెరుగుదల మొదలైంది.. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.. నిన్న అమాంతం పడిపోయిన వెండి ధర ఈరోజు ఒక్కసారిగా దూసుకెళ్లింది. వెండి ధర ఆకాశాన్ని చూస్తుంది.. నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.5300 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.74,500 కి చేరింది. ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు.