Today Gold Rate: బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో.. అంచనా వేయలేం.. ఈ 16 రోజుల్లో బంగారం ధర 7 సార్లు పెరిగింది.. 7సార్లు తగ్గింది.. 2సార్లు మాత్రమే స్థిరంగా ఉంది.. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు అతి స్వల్పంగా తగ్గాయి.. నేటి బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Read More: Job update: ఏపీ వైద్య విధాన పరిషత్ లో 453 ఖాళీలు..!!
బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. నిన్నటి ధర రూ.45,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోల్చుకుంటే అతి స్వల్పంగా రూ.10 తగ్గింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.49,630 కి చేరింది.. నిన్న భారీగా తగ్గిన వెండి ధర ఈరోజు కూడా అదే బాటలో పయనించింది.. నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.600 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.75,900 కి క్షీణించింది.. గత నాలుగు రోజులుగా బంగారం, వెండి ధర తగ్గుతూ రావటం తో కొనుగోలు చేసే వారికి భారీ ఊరట కలిగిస్తోంది..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?