నభా నటేష్… గుర్తుందా? నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తోనే టాప్ పొజిషన్ కు వచ్చేసింది. పాపులారిటీ పెంచేసుకున్నది.
చేసింది రెండు మూడు సినిమాలే అయినా.. తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే. నభాకు సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సాధారణంగా కొందరు హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ప్రేమలో పడతారు. కొందరు కోస్టార్లనే ఇష్టపడతారు. పెళ్లి చేసుకుంటారు. కొందరి ప్రేమలు పెళ్లి దాకా వెళ్లవు. సరే.. అది వేరు స్టోరీ లేండి.
ఈ అమ్మడు కూడా ప్రేమలో పడిందట. వాళ్లతో వీళ్లతో కాదు.. ఏకంగా ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిపోయిందట ఈ గుమ్మ. ఆ హీరోను చూడగానే పడిపోయిందట. అంతలా నభానను ప్రేమలోకి దించేసిన ఆ హీరో ఎవరబ్బా అని తెగ ఆలోచిస్తున్నారా? ఇంకెవరు మన సొట్ట బుగ్గల చిన్నోడు షారుక్ ఖాన్.
సినిమాల్లోకి రాకముందు షారుక్ అంటే కేవలం ఇష్టం మాత్రమే ఉండేదట తనకు. కానీ.. ఇప్పుడు ఇష్టం కాస్త ప్రేమలా మారిందట.
షారుక్ ఖాన్ అనే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటించిన కుచ్ కుచ్ హోతా హై సినిమాను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. స్కూల్ డేస్ లో ఉండే ఆకర్షణ వేరు. కానీ.. ఇప్పుడు కూడా ఆయన మీద ఇష్టం ఉంది అంటే.. నేను ఆయనను లవ్ చేస్తుండటమే అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది నభా నటేష్.
ఇక.. తన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నభా నటేష్ సోలో బతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తోంది. వరుణ్ తేజ్ సరసన కూడా మరో సినిమాలో నటిస్తోంది.