టాలీవుడ్ హీరోలకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?

సినిమా హీరోలు కదా ఇష్టమైన ఆహారం తింటే వారి శరీరాకృతి మారిపోతుందని. సినిమా అవకాశాలు తగ్గుతాయని, వారు డైట్ చేస్తున్నారని అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. సినిమా హీరోలకు వారి ఇష్టమైన ఆహారాన్ని ఫుల్ గా తిని, వారి ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి వ్యాయామాలు, డైట్ లు చేస్తుంటారు. వారికి ఇష్టమైన ఆహారం కనిపిస్తే తినకుండా అసలు ఉండము అని చెబుతున్నారు ఈ సెలబ్రిటీస్. ఆ సెలబ్రెటీస్ ఎవరు? వారికీ ఇష్టమైన ఆహారం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం..

 

చిరంజీవి..

గోదావరి జిల్లాల నుంచి ఇండస్ట్రీకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ‘సీ’ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే ఏంటో ఇష్టంగా తింటాడట. అది మాత్రమే కాదు పల్లీల చట్నీతో దోస ఎంతో ఇష్టంగా తింటాడట.

రజినీకాంత్..

చికెన్ లేదా మటన్ కర్రీ అంటే ఎంతో ఇష్టపడతాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ రెండు ఉంటే డైట్ అన్న విషయం కూడా మర్చిపోయి లాగిచేస్తుంటాడు సూపర్ స్టార్.

పవన్ కళ్యాణ్..

నెల్లూరు చేపల పులుసు, నాటుకోడి పులుసు, అరటికాయ వేపుడు అంటే తెగ ఇష్టంగా తినేస్తాడట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

మహేష్ బాబు..

మహేష్ బాబు చేపల పులుసు, చికెన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టంగా తింటాడట.

బాలకృష్ణ..

బాలకృష్ణకు చికెన్ బిర్యాని రొయ్యల పులుసు అంటే ఎంతో ఇష్టం వాటితో పాటు లంక చుట్ట పొగతాగడం బాలయ్యకు అలవాటు ఉందట.

నాని..

చూడటానికి ఎంతో నాచురల్ గా కనిపించే నాని తిండి విషయంలో కూడా చాలా నాచురల్. ఇడ్లీ, సాంబర్ ఎంతో ఇష్టంగా తింటారట.

ప్రభాస్..

ప్రభాస్ కు నాన్ వెజ్, సీఫుడ్ అంటే ఎంతో ఇష్టం. అంతేకాకుండా రోడ్ సైడ్ దొరికే పానీపూరీలు కూడా ఎంతో ఇష్టంగా తింటాడు.

దగ్గుబాటి రానా..

రానాకు అమ్మమ్మ చేసే సాంబార్ అంటే ఎంతో ఇష్టమట.

నాగ చైతన్య..

అన్ని రకాల ఇండియన్ ఫుడ్స్ ఎంతో ఇష్టంగా తింటాడట అక్కినేని వారసుడు నాగ చైతన్య.