Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులకు.. నిర్మాతలకు కొత్త తలనొప్పి..??

Share

Tollywood: మహమ్మారి కరోనా వైరస్ తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వైరస్ వల్ల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు.. చాలా ఉద్యోగాలు జనాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక లావాదేవీలు జరిగే పరిస్థితి లేకపోవడంతో… ఒక్క మే నెలలో నే ఇండియాలో 15 మిలియన్ల ఉద్యోగాలు పోయినట్లు ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు తెలియజేస్తూ ఉన్నాయి. మొత్తంమీద బయట ప్రపంచంలో కరువు ఏలుబడి చేస్తున్నట్టు పరిస్థితి మారింది.

The Shadow Of Many Women Standing Together Stock Vector - Illustration of standing, beauty: 172713262

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే తరహాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దర్శకులకు మరియు నిర్మాతలకు కొత్త కరువు ఏర్పడింది. మేటర్ లోకి వెళ్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ప్రతిష్ఠాత్మకమైన కాంబినేషన్లు సెట్ పైకి రావడం తెలిసిందే. డైరెక్టర్లు హీరోలు ఒకే అవుతున్న గాని ఈ సినిమాలలో హీరోయిన్లు కన్ఫామ్ చేయలేని పరిస్థితి ఏర్పడిందట. ఇండస్ట్రీ మొత్తం మీద తిట్టు కొట్టు చూస్తే పూజా హెగ్డే, రష్మిక మందన మినహ పెద్ద టాప్ హీరోయిన్లు ఎవరు కూడా కనబడని పరిస్థితి.

Read More: Tollywood: కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న టాలీవుడ్ సెలెబ్రిటీల వివరాలు..!!

అయితే ఉన్న ఇద్దరిని ఇప్పటికే హీరోలు రిపీట్ చేయడంతో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో… హీరోయిన్లు కన్ఫామ్ కాలేకపోతున్నారు అట. త్రివిక్రమ్- మహేష్, కొరటాల- ఎన్టీఆర్, బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలకు.. ఎవరిని హీరోయిన్ గా తీసుకోవాలి అనేదానిపై డైరెక్టర్లు నిర్మాతలు… కన్ఫ్యూజన్ అవుతున్నారట. ఒక్క ఈ కాంబినేషన్లతో మాత్రమే కాక ఇండస్ట్రీలో అనేక కాంబినేషన్ లకు ఇదే సమస్య ఏర్పడుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.


Share

Related posts

బ్రేకింగ్: ఏపీలో ఈ ఏడాది అన్ని అవార్డులూ రద్దు

Vihari

YS Jagan : ఈ గెలుపుతో.. జ‌గ‌న్ పై ఆ మ‌చ్చ తొల‌గిపోయిన‌ట్లే…

sridhar

రైడర్ల కోసం KTM డ్యూక్ 125 న్యూ బైక్ .. ఫీచర్లు చూస్తే కొవాలనిపిస్తుంది!

Teja