టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో రాజ్ తరుణ్ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రాజ్ తరుణ్ కు హీరోగా వరుస అవకాశాలొచ్చాయి. ఉయ్యాల జంపాల సినిమా తరువాత రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలు కూడా హిట్ కావడంతో మినిమం గ్యారంటీ హీరోగా రాజ్ తరుణ్ కు పేరొచ్చింది.
అయితే కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత ఆ స్థాయి సక్సెస్ మాత్రం రాజ్ తరుణ్ కు దక్కడం లేదు. వరుస ఫ్లాపులతో రాజ్ తరుణ్ కెరీర్ లో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కినా ఆ సినిమాలు సైతం డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి. ఇలాంటి సమయంలో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ఓటీటీ ద్వారా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది.
ఈ సినిమా ఫలితంపైనే రాజ్ తరుణ్ కెరీర్ ఆధారపడి ఉంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒరేయ్ బుజ్జిగా రాజ్ తరుణ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక కార్యక్రమానికి హాజరైన రాజ్ తరుణ్ ఆ కార్యక్రమంలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు
తనది వైజాగ్ అని.. వైజాగ్ అబ్బాయిలు బయట తిరగడానికే ఎక్కువగా ఇష్టపడతారని అన్నారు. లోక జ్ఞానం బయట తిరిగే కుర్రాళ్లకే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తన సినిమాలోని పాటలా నిజ జీవితంలో తాను బ్యాడ్ బాయ్ నేనని సరదాగా చెప్పారు. పెళ్లి గురించి ప్రశ్న ఎదురు కాగా పెళ్లికి ఇంకా సమయం ఉందని.. ప్రేమించే పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. మరి రాజ్ తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకునే ఆ లక్కీ గాళ్ ఎవరో!