Bigg Boss 6 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సిక్స్ త్వరలో స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సారి డిఫరెంట్ గా ఓటిటిలో 24 గంటలు హౌస్ లో జరిగేది.. ఎడిటింగ్ లేకుండా చూపిస్తున్నట్లు షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అంతమాత్రమే కాకుండా ఈసారి ఎక్కువ ఫిజికల్ టాస్క్ లు.. గేమ్స్ సీజన్ 6 ఆడించడానికి రెడీ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో… ఓటిటి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాగా తెలిసిన ముఖాలని.. హౌస్ లోకి తీసుకోవడానికి షో నిర్వాహకులు. ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారట.
ముఖ్యంగా కంటెస్టెంట్ ల విషయంలో… చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సరికొత్త టాక్ వినిపిస్తొంది. బయట కరోనా కారణంగా సినిమా థియేటర్లపై.. కరోనా(Corona) ఆంక్షలు విధిస్తూ ఉండటంతో.. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లకి…ఓటిటి బిగ్ బాస్(Bigg Boss) ద్వారా ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ అందించాలి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. దీంతో వీకెండ్ ఎపిసోడ్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని… డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) టీం చేత స్క్రిప్ట్ లు రాయిస్తున్నారట. త్రివిక్రమ్ టీం యాడ్ లు షూట్ చేయడంలో..చాలా స్పెషలిస్ట్ అని అందరికీ తెలుసు. దేశంలో టాప్ మోస్ట్ కంపెనీలు గురూజీ దర్శకత్వంలో… ప్రొడక్ట్ పబ్లిక్ లోకి బలంగా వెళ్లే లాగా…అర్థమయ్యే కాన్సెప్ట్ తో…షూట్ చేసేవారు.
కాగా ఈ తరుణంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు…వీకెండ్ ఎపిసోడ్ లలో అదిరిపోయే కంటెంట్ తో… ఎంటర్టైన్మెంట్ అందించడానికి… త్రివిక్రమ్ బృందంతో ఒప్పందం… కుదుర్చుకున్నట్లు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు లేటెస్ట్ టిక్ టాక్ సోషల్ మీడియాలో వినబడుతోంది. కరోనా కారణంగా సినిమా షూటింగులకి సంబంధించి ఆలస్యం అవుతూ ఉండటం తో పాటు ప్రభుత్వాల ఆంక్షల కారణంగా.. డైరెక్టర్ త్రివిక్రమ్ సీజన్ సిక్స్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లకి… దాదాపు ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.