Rare Photo: పాత జ్ఞాపకాలు, అప్పటి ఫోటోలు అందరికీ అపురూపమే.. అలనాటి ఫోటోలను చూస్తుంటే ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోతాం.. పెళ్లి ఫోటోలను చూస్తుంటే ఎంత సేపు చూసినా తనివితీరదు.. అప్పుడు అలా ఉన్నాం.. ఇప్పుడు ఇలా ఉన్నామంటూ కంపేర్ చేసుకుంటూ ఉంటాం.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పెళ్లి ఫోటో పోస్ట్ చేసి ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా అంటూ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Read More: Love Proposal: ఈ కుర్రాడి ఐడియా అదిరింది గురు.. పానీపూరి లో రింగ్ పెట్టి లవ్ ప్రపోజ్.
ఇంతకీ ఆ ఫోటో ఎవరిదంటే.. మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌజన్య ను పెళ్లి చేసుకున్న ఫోటో..!! ఈ ఫోటోలో త్రివిక్రమ్ కొంచెం లావుగా ఉండటంతో వెంటనే ఎవరు గుర్తుపట్టలేక పోతున్నారు.. ఇంతకీ మీకు త్రివిక్రమ్ పెళ్లి స్టోరీ తెలుసా.. త్రివిక్రమ్ పెళ్లి చూపులకు అక్క ని చూడడానికి వెళ్లి చెల్లెను ఇష్టపడ్డారు. త్రివిక్రమ్ సౌజన్య వాళ్ళ అక్కని చూసేందుకు పెళ్లి చూపులకు వెళ్లారట అయితే అక్క పక్కల ఉన్న సౌజన్య చూసి ఇష్ట మపడ్డాడట మాటల మాంత్రికుడు. వెంటనే తన మనసులోని మాటను సౌజన్య తల్లిదండ్రులకు చెప్పడంతో మంచి సంబంధం సీతారామశాస్త్రికి నచ్చిన వ్యక్తి, ఎటువంటి చెడు అలవాట్లు లేని అబ్బాయి కావడంతో వారు కూడా ఇందుకు ఒప్పుకున్నారట. అయితే సౌజన్య అక్క పెళ్లి అయిన తరువాత మీ పెళ్లి చేస్తామని వారి తల్లిదండ్రులు కండిషన్ పెట్టారట. దీనికి త్రివిక్రమ్ ఒప్పుకొని ఆమె పెళ్లయిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. త్రివిక్రమ్ సౌజన్యలకు ఇద్దరు పిల్లలు..
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయిత నుంచి దర్శకుడిగా మారిన తర్వాత ఎక్కువగా స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో 11 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఏ సినిమాకి ఇప్పటికే మాటల మాంత్రికుడు రెడీ చేశాడట. 2021 ఆగస్టులో షూటింగ్ ప్రారంభం చేసి 2022 కి సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?