టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

WhatsApp: ఇక నుండి వాట్సాప్ లో కూడా ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఫీచర్స్ తెలియజేసిన మార్క్ జుకర్ బర్గ్…!!

Share

WhatsApp: వాట్సాప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. మేటర్ లోకి వెళ్తే ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లో వచ్చే ప్రతీ మెసేజ్ కి తక్షణమే ప్రతిస్పందించే రీతిలో ఏమోజిస్ ఉన్నాయి. లైక్, లవ్వు, సాడ్, సర్ ప్రైజ్, లాఫ్, థాంక్స్… ఈ ఆరు కూడా.. అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అవతల వ్యక్తి మనకి మెసేజ్ పెడితే దానికి ప్రతిస్పందించే తరహాలో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లో ఈ ఫీచర్ ఉంది. ఇప్పుడు ఇదే ఫీచర్ వాట్సాప్ లోకి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ ఫేస్బుక్ లో నిన్న తెలియజేశారు.

two new feature's emoji reaction's coming in what's app

ఈ ఆరు ఏమోజి రియాక్షన్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. చాటింగ్ చేస్తున్న సమయంలో తక్షణమే ఈ ఏమోజీ పనిచేసే విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేశారు. లాంగ్ ప్రెస్ చేస్తే వాట్సాప్ లో ఈ ఆరు రీయాక్షన్స్ వస్తాయని.. పేర్కొన్నారు. దాదాపు వాట్సాప్ లో ఈ ఎమోజీ లకి సంబంధించిన పనితనం పై మూడు సంవత్సరాలు పని చేయడం జరిగిందని.. స్పష్టం చేశారు.

two new feature's emoji reaction's coming in what's app

ఎమోజీ రియాక్షన్ ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ అప్డేట్ కి సంబంధించిన వాటికి కూడా రియాక్షన్ తెలియజేయవచ్చు. అంతమాత్రమే కాదు వాట్సాప్ గ్రూప్ సభ్యులు షేర్ చేసే మెసేజ్ లని డిలీట్ చేసే అవకాశాన్ని గ్రూప్ అడ్మిషన్ కి ఇచ్చే రీతిలో ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ కొత్త ఫీచర్ ద్వారా… వాట్సాప్ లో ఫేక్ న్యూస్ ప్రచారానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమోజీ రియాక్షన్ ఫీచర్ కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ సంస్థ తెలియజేసింది.


Share

Related posts

Balakrishna : ఈ జానపద చిత్రంలో నటించి తండ్రి ఎన్.టి.ఆర్ ని గుర్తు చేశారు బాలయ్య..ఆ చిత్రం ఏదో తెలుసా..?

GRK

ఏపి పోలీసులపై కేసు నమోదు

sarath

నాగ చైతన్య సక్సస్ ట్రాక్ దెబ్బైపోయినట్టేనా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar