ట్రెండింగ్

UAE Unemployement Scheme: నిరుద్యోగుల విషయంలో యూఏఈ ప్రధాని కీలక నిర్ణయం..!!

Share

UAE Unemployement Scheme: మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం ఉన్న కొద్దీ పెరిగిపోతున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మహామారి వాళ్ళ కంపెనీలు మూతపడటంతో నిరుద్యోగ సమస్య ప్రతి దేశాన్ని వేధిస్తున్నట్లు పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా నిరుద్యోగం పెరిగిపోతుండటంతో ఆ దేశ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్.. సంచలన ప్రకటన చేశారు. విషయంలోకి వెళితే యూఏఈ దేశంలో నిరుద్యోగులకు… నిరుద్యోగ బీమా పథకం వర్తింప జేస్తున్నట్లు స్పష్టం చేశారు.

UAE governament approves Unemployement Scheme for unemployees in uae

ఈ పథకం ప్రవేశ పెట్టడానికి ప్రధాన కారణం దేశంలో ఆర్థిక పోటీ పెరిగి పోవడంతో పాటు ప్రతిభ ఉన్న వారిని మరియు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి… ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో నిరుద్యోగ బీమా పథకానికి యూఏఈ మంత్రివర్గం ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ నిరుద్యోగ బీమా పథకం… కేవలం యూఏఈ పౌరులకేనా… లేకపోతే యూఏఈ దేశానికి వలస కార్మికులకు వచ్చిన వారికి కూడా వర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

 

త్వరలో ఈ బీమా విధి విధానాలు స్పష్టం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ వలస కార్మికులకు కూడా ఈ పథకం వర్తింపజేసే పరిస్థితి ఉంటే… ఉద్యోగం కోల్పోతే కొంతకాలం వరకు.. డబ్బులు పొందవచ్చని.. అదే రీతిలో కార్మికులకు సామాజిక భద్రతను కూడా అందించే అవకాశం ఉందని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి యూఏఈ నిరుద్యోగ బీమా పథకం విధానాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కూడా యూఏఈ ప్రభుత్వం.. సరికొత్త విధి విధానాలు తీసుకురావడం జరిగింది. దీంతో ప్రపంచంలో ఇప్పుడు చాలామంది పారిశ్రామికవేత్తలు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో.. భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Internet Desk : తమ గ్లామర్ తో ఇంటర్నెట్ ని హీట్ లెక్కిస్తున్న టాప్ హీరోయిన్స్..!!

bharani jella

‘వాడి వల్లే చచ్చిపోయేలా ఉన్నా – సీరియల్ జరుగుతున్నప్పుడు ఏమైంది అంటే’ శివపార్వతి సంచలన వ్యాఖ్యలు

arun kanna

మరోసారి కలిసి నటించనున్న సూర్య జ్యోతిక!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar