Uday Kiran: ఓటీటీలో విడుదలకానున్న ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం..!!

Share

Uday Kiran: “చిత్రం” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్.. మొదటి సినిమాతోనే ఉదయ్ కిరణ్ హిట్ సాధించాడు.. తరువాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు కూడా ఘన విజయం సాధించాయి దీంతో ఉదయ్కిరణ్ తొలి హ్యాట్రిక్ హీరోగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.. ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.. ఉదయ్ కిరణ్ నటించిన నా ఆఖరి సినిమా “చిత్రం చెప్పిన కథ”..

Uday Kiran: acting last movie release on OTT platform
Uday Kiran: acting last movie release on OTT platform

Sonali Bendre: కంటతడి పెట్టిస్తున్న సోనాలి బింద్రే పోస్ట్..!!

2014 జనవరి 6 న ఉదయ్ కిరణ్ మరణించారన్న వార్త అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది.. సుమారు ఏడు సంవత్సరాల క్రితం ఉదయ్ కిరణ్ నటించిన సినిమా పాపులర్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తో రిలీజ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా మా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అందరిని అలరించిన ఉందని టాక్. 2014 లోని ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది అయితే ఆర్థిక కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఈ సినిమాలు మోహన్ ఏఎల్ ఆర్ కె దర్శకత్వంలో సీహెచ్ మున్నా నిర్మించారు. ఈ చిత్రంలో లో ఉదయ్ కిరణ్ సరసన మదాలసా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి మున్నా కాశి సంగీతాన్ని సమకూర్చారు. ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం త్వరలో రిలీజ్ కానుండడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..


Share

Related posts

వైసిపి కౌంటింగ్ ఏజంట్‌లకు శిక్షణ

somaraju sharma

ఎల్జీ పాలిమర్స్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

somaraju sharma

ఇంద్ర‌గంటి శ్రీకాంత్ శ‌ర్మ క‌న్నుమూత‌

Siva Prasad