Ukraine Russia War: ఉక్రెయిన్ సైనికులు రష్యాతో చేస్తున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ని కదిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా బలమైన దేశం కావడంతో ఉక్రెయిన్ కి మద్దతుగా ఇతర దేశాలకు చెందిన వాళ్లు కూడా రంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొన్నట్లు ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న యుద్ధం విషయంలో రెండు దేశాలు కూడా ఎక్కడా తగ్గడం లేదు. నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. యుద్ధ సామర్థ్యంతో పోలిస్తే రష్యా కంటే తక్కువ బలం ఉక్రెయిన్ ది. అయినా కానీ పోరాడుతూ ఉంది.
ఇటువంటి తరుణంలో … శక్తికి మంచి పోరాటం చేస్తున్నా ఉక్రెయిన్ సైనికులకు మంచి జోష్ ఇచ్చేలా వారిలో దేశభక్తిని నింపేలా…ఉక్రెయిన్ ప్రజలు సరికొత్త గా వ్యవహరిస్తున్నారు. యుద్ధం విషయంలో రష్యాపై ఆక్రోశంతో రగిలిపోతూ మాతృదేశం పై ప్రేమ కలిగేలా… తమ శరీరాలపై ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన చిహ్నాలను పచ్చబొట్టు రూపంలో… టాటూలు…బిల్ బోర్డ్ లు… వేయించుకుంటున్నారు. ఈ పరిణామంతో ఉక్రెయిన్ దేశంలో టాటూకి భారీ డిమాండ్ పెరిగింది. ఉక్రెయిన్ దళాలకు మద్దతుగా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు దేశ ప్రజలంతా భారీ ఎత్తున దేశానికి సంబంధించిన చిహ్నాలు పచ్చబొట్లు రూపంలో వేయించుకొని మాతృదేశం పై ప్రేమను చాటుతున్నారు.
దేశం కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ సైన్యానికి మంచి బూస్ట్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. మరోపక్క రష్యా బలగాలు ప్రభుత్వ భవనాలను సామాన్య జనులపై కూడా దాడులకు పాల్పడుతూన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉండటం తో… రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ప్రపంచంలో చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. యుద్ధ ముదిరితే కనుక మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుంది అనే టాక్ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.