ట్రెండింగ్

Russia Ukraine: రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం రంగంలోకి మరో కీలక వ్యక్తి..??

Share

Russia Ukraine: ఒకపక్క కరోనా మరోపక్క కరువు.. ఇంకోపక్క రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం.. ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. యుద్ధం విషయంలో రెండు దేశాల అధినేతలు ఎవరు కూడా తగ్గేదేలే అనే తరహాలో మొండివైఖరి ప్రదర్శిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే యుద్ధాన్ని ఆపడానికి ప్రారంభంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెఫ్ట్టాలి బెనెట్ .. రంగంలోకి దిగటం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్…ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో వేర్వేరుగా చర్చలు జరిపారు.

UN Chief To Meet Zelensky And After Russia Visit - Sakshi

అయినా చర్చలు విఫలం కావడంతో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలు ఒకపక్క.. చర్చలతో.. సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో.. యుద్ధం ఆగే పరిస్థితి ఎక్కడ కనిపించని నేపథ్యంలో…. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుతెరెస్ రెండు దేశాలలో పర్యటించనున్నారు. ముందుగా ఈ నెల 26వ తారీకు రష్యాలో ఆతర్వాత 28వ తారీకు ఉక్రెయిన్ లలో పర్యటించడానికి సిద్ధమయ్యారు.

Israel's Bennett speaks with Putin, Zelenskyy separately in effort to  mediate Ukraine crisis | Fox News

యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. కొంత మంది చిక్కుకు పోయారని ఐక్యరాజ్యసమితి అధికార బృందం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో రష్యా యుద్ధానికి విరామం ఇవ్వాలని అంటున్నారు. యుద్ధం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయంలో రెండు దేశాల అధినేతలు సమస్యలను కూర్చుని చర్చించుకోవాలి అని ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఆంటోనియా గుటేరాస్ స్పష్టం చేశారు. దీంతో ఏకంగా కాగా ఐక్యరాజ్యసమితి కీలక సభ్యుడు రెండు దేశాలలో పర్యటించడానికి రెడీ అవ్వడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రష్యా బలగాలు చేస్తున్న దాడులకు…ఉక్రెయిన్ లో చాలా ప్రధాన నగరాలు స్మశాన భూములుగా మారాయి. ఇదే సమయంలో కొన్ని రసాయనిక దాడులు కూడా రష్యా చేస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.


Share

Related posts

Skin Lightening: మోకాలు, మోచేయి పై ఉన్న నలుపు పోగొట్టే సింపుల్ చిట్కా..!

bharani jella

Baby Foods: చిన్న పిల్లలకి ఇంట్లోనే ఇవి చేసి పెట్టండి.. చాలా సింపుల్..!!

bharani jella

Bigg Boss 6 Telugu: ‘ ఓకే కానీ ఒక కండిషన్ ‘ బిగ్ బాస్ 6 కి రావాలి అంటే భారీ కండిషన్ పెట్టిన అనసూయ ?

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar