18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
Featured ట్రెండింగ్ సినిమా

శ్వేతా బసు జీవితంలో ఎవరికి తెలియని నిజాలు ఇవే!

Share

శ్వేత బసు ప్రసాద్ ఈ పేరు వినగానే ‘ఏకడా…’అనే డైలాగ్ అందరికీ వెంటనే గుర్తొస్తుంది.” కొత్త బంగారు లోకం” అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ ఈ సినిమాలో ‘ఏకడా..’అనే డైలాగ్ ద్వారా అందరిని ఆకట్టుకున్నారు. అప్పట్లో ఎంతో విజయవంతం అయింది. మొదటి చిత్రం మంచి విజయం సాధించడంతో తర్వాత సినిమాలలో నటించిన శ్వేతాబసు ప్రసాద్ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అతను చూపు బాలీవుడ్ వైపు మళ్లింది.ఈరోజు (జనవరి 11) పుట్టినరోజు జరుపుకుంటున్న శ్వేతా బసు గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

అయితే బాలీవుడ్ లో కూడా కేవలం చిన్న చిన్న సినిమాల్లో నటించారు. బాలీవుడ్ ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ సినిమాలు ఏకంగా వదిన పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడువివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం ది తాష్కెంట్ ఫైల్స్ అనే చిత్రంలో శ్వేతా బసు ప్రసాద్ చివరిగా కనిపించారు. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా తెలుగు హిందీ భాషలలో కలిపి ఇప్పటి వరకు ప్రసాద్ కేవలం ఎనిమిది సినిమాలలో మాత్రమే నటించారు.

ముంబై లో పుట్టి పెరిగిన శ్వేతాబసు 2002వ సంవత్సరంలో మక్దే చిత్రంలో బాల నటిగా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో ఈమె నటనకు గాను ఉత్తమ బాలనటి అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. అయితే 2014 సంవత్సరంలో సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయిన శ్వేతా బసు గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. తరువాత ఈమె నిర్దోషి అని తెలియ చేసినప్పటికీ కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. కాగా ప్రముఖ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం పాటు డేటింగ్ లో ఉన్న వీరు 2018 సంవత్సరంలో పెళ్లి చేసుకుని తిరిగి సంవత్సరానికి వీరి వెళ్లి పోతున్నట్లు శ్వేతాబసుప్రసాద్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఆ కంటెస్టెంట్ వల్లనే హౌస్ లో గ్రూపులు ఏర్పడ్డాయి అంటున్న మాస్టర్..!!

sekhar

మీకు దగ్గరగా ఉన్నవారు మాస్క్ పెట్టుకోవడం లేదా? అయితే అంతే సంగతులు!

Teja

బిగ్ బాస్ బ్యూటీ మోనాల్‌ను చూసి ఓర్వలేకపోతున్నది ఎవ్వరో తెలుసా?

Naina