Prabhas NTR: ప్రభాస్ -ఎన్టీఆర్ ల గురించి సంచలన కామెంట్స్ చేసిన ఉప్పెన హీరో..!!

Share

Prabhas NTR: మెగా కాంపౌండ్ నుండి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా “ఉప్పెన” తోనే సూపర్ డూపర్ హిట్ కొట్టడం జరిగింది. మెగా కాంపౌండ్ నుండి చాలా మంది హీరోలు పరిచయం అయిన గాని ఈ స్థాయి విజయం ఎవరు దక్కించుకోలేదు. మొదటి సినిమాతోనే చాలా టాలెంట్ ఉన్న నటుడు అన్న రీతిలో వైష్ణవ్ తేజ్ తెలుగు ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అటువంటి వైష్ణవ తేజ్ ఇటీవల ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో వీడియో రూపంలో చిట్ చాట్ చేయడం జరిగింది.

Vaishnav Tej Clarifies on Surname 'Panja'

ఈ సందర్భంగా అభిమానులు ఫోన్ వాల్ పేపర్ ఏముందో చూపించాలని కోరగా వెంటనే.. స్క్రీన్ షాట్ తీసి సోనాక్షి సిన్హా ఫోటో చూపించాడు. అమ్మ అంటే అంత ఇష్టమా అని అభిమానులు అనగా కాదు తనంటే నాకు చాలా ప్రేమ అంటూ..వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో అభిమానుల హీరోల విషయం వచ్చేసరికి తనకి సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే చాలా ఇష్టమని నిర్మొహమాటంగా మనసులో మాట బయట పెట్టేసాడు.

Read More: Uppena : ఉప్పెన డైరెక్టర్ కి కరోనా సెకండ్ వేవ్ దెబ్బ తగిలిందా..?

రజనీకాంత్ నటించిన అన్ని సినిమాల్లో కంటే ఎక్కువగా “శివాజీ” సినిమా అంటే తన ఫేవరెట్ సినిమా అని తెలిపాడు. అదేరీతిలో పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం అని.. ఆయన నుండి స్ఫూర్తి పొందుతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇండస్ట్రీలో హీరోల గురించి మాట్లాడుతూ…ప్రభాస్ అయితే ఇండస్ట్రీ లో పెద్ద అన్నయ్య, ఎన్టీఆర్ వెల్ విషర్.. అల్లు అర్జున్ అంటే స్టైల్ వరుణ్ అంటే కింగ్ అని చెప్పుకొచ్చాడు.


Share

Related posts

Relationship Tips: శృంగారం ఆస్వాదించాలంటే ఇలా ప్లాన్ చేసుకుని చూడండి!!

Kumar

‘ఎవరూ మాట్లాడొద్దు’

somaraju sharma

కేంద్రంలో తెలుగు నేతకు కరోనా వైరస్ సోకిందా?

Muraliak