ట్రెండింగ్

Ustad Zakir Hussain: ప్రాణం మిత్రుడి పాడె మోసిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్..!!

Share

Ustad Zakir Hussain: ప్రముఖ సంతూర్ వాయిద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ ఈనెల 10వ తారీకు గుండెపోటుతో మరణించారు. భారత సంగీత విద్వాంసుడిగా పేరొందిన శివకుమార్ శర్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని విషాదంగా మిగిల్చింది. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు మరుసటిరోజే ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. చాలా మంది ప్రముఖులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సంగీత కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Ustad Zakir Hussain Attend Shivakumar sharma funeral Program photo viral

ఈ క్రమంలో శివకుమార్ శర్మ అంత్యక్రియలలో ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే శివ కుమార్ శర్మ, జాకీర్ హుస్సేన్ ఇద్దరు కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు. శివకుమార్ శర్మ కంటే దాదాపు 13 సంవత్సరాలు తక్కువ వయసు…71 సంవత్సరాలు కలిగిన జాకీర్ హుస్సేన్.. చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరి మధ్య వయస్సులో చాలా తేడా ఉన్నా గాని… ప్రాణ స్నేహితులు లాగా మెలిగేవారు. ఈ తరుణంలో తన ప్రాణ స్నేహితుడు అంత్యక్రియలకి హాజరైన జాకీర్ హుస్సేన్… శివకుమార్ పాడే మోశారు. ఆతర్వాత అంత్యక్రియల చివరిలో ఒంటరిగా కాసేపు చితి వద్దే జాకీర్ హుస్సేన్ నిలబడి పోయారు. ఆ సన్నివేశం కెమెరాలకు చిక్కడంతో ఆ ఫోటో ఇప్పుడు… సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్దగా ప్రముఖులు హాజరు కాకపోయిన కొద్ది మంది హాజరై.. శివకుమార్ శర్మ అంత్యక్రియలు ప్రభుత్వ పరంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శివకుమార్ శర్మ అంత్యక్రియలకు రాని వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో నివాళులర్పించారు.


Share

Related posts

NISCHAY Wedding : మెహందీ సెలబ్రేషన్స్ అఫిషియల్ వీడియో వచ్చేసింది

Varun G

KCR : కేసీఆర్ ను కాపీ కొట్టేస్తున్న జ‌గ‌న్‌… సంచ‌ల‌న‌మే!

sridhar

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ రవికి అదే బెనిఫిట్ అంటున్న ఆడియన్స్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar