Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో వైష్ణవీ చైతన్య, బిగ్ బాస్ కోసం చాలా పెద్ద ప్రాజెక్ట్ వదులుకుంది ?

Share

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్(Bigg Boss) రియాల్టీ షోలో అడుగుపెడితే క్రేజ్ ఉన్న కొద్ది పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో హౌస్ లో ఏ మాత్రం తేడా చేస్తే.. అదే రేంజిలో బయట డామేజ్ కావడం కూడా జరుగుతుంది. కాగా ప్రస్తుతం తెలుగులో ఐదు సీజన్లు కంప్లీట్ కావడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 19 వ తారీకు నాడు సీజన్ ఫైవ్ విన్నర్ గా.. సన్నీ(Sunny) గెలవటం తెలిసిందే. అయితే టైటిల్ ప్రకటించిన వారం రోజులకే.. బిగ్ బాస్ షో నిర్వాహకులు.. సీజన్ సిక్స్ మరో రెండు నెలల్లో స్టార్ట్ కానున్నట్లు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మైంది. ఈ క్రమంలో సీజన్ సిక్స్ కి సంబంధించి కంటెస్టెంట్ లనీ సెలెక్ట్ చేసే పనిలో షో నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి రావడం జరిగింది. యాంకర్ వర్షిని(Varshini),యు ట్యూబ్ యాంకర్ శివ(Shiva), అదే రీతిలో ఢీషో కి చెందిన ప్రముఖ డ్యాన్సర్ తో పాటు.. జబర్దస్త్ షో కి చెందిన వాళ్లు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఈసారి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా సెలబ్రిటీలు వెండితెరపై మెప్పిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో యూట్యూబ్ లో వెబ్ సిరిస్ ల ద్వారా… మంచి క్రేజ్ సంపాదించిన వైష్ణవి చైతన్య(Vaishnavi Chaithanya).. ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో.. ఎంట్రీ ఇవ్వనున్నట్లూ వార్తలు వస్తున్నాయి. వైష్ణవి చైతన్య సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో పాటు “అలా వైకుంఠపురం లో” సినిమాలో…అల్లు అర్జున్ చెల్లెలుగా నటించడం జరిగింది. ఇంత మంచి గుర్తింపు సోషల్ మీడియాలో సినిమా రంగంలో అందుకున్న వైష్ణవి చైతన్య కి.. ఇండస్ట్రీ లో అవకాశాలు భారీగానే వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం .. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ వైష్ణవి చైతన్య వదులుకోవటం జరిగిందట.

 Vaishnavi Chaitanya: యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు ఈ పేరు బాగానే పరిచయం. ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా సెలబ్రిటీలు వెండితెరపై మెప్పిస్తున్నారు. తాజాగా మరో సోషల్ మీడియా స్టార్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే వెండితెరపై అలా వైకుంఠపురంలో బన్నీకి చెల్లిగా నటించిన వైష్ణవి చైతన్య మరిన్ని అవకాశాలు అందుకుంటుంది. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి.. పలువురు సినీ నిర్మాతల దృష్టిలో కూడా పడింది. దీంతో వైష్ణవికి హీరోయిన్ గా నటించడానికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.

మెగా కాంపౌండ్ కి చెందిన ఓ ప్రముఖ హీరో సినిమాలో.. ప్రధానమైన పాత్ర కలిగిన. మంచి బేస్ ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ సోలో కనబడటానికి హౌస్ లో అడుగు పెట్టడానికి వైష్ణవి చైతన్య వదులుకున్న ట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సీజన్ సిక్స్.. కేవలం 50 రోజుల నిడివితో పాటు..ఓటిటి..లో 24 గంటలు ప్రసారం అవుతూ.. ఏడు రోజులు ప్రత్యక్ష ప్రసారం అయ్యే  విధంగా సీజన్ సిక్స్ ఏర్పాటు చేయడంతో వైష్ణవి చైతన్య.. ఇదే మంచి ఛాన్స్ అని భావిస్తూ.. ఇండస్ట్రీలో  మెగా ప్రాజెక్టు సినిమా ఛాన్స్ వదులుకున్నట్లు… వార్తలు వైరల్ అవుతున్నాయి.


Share

Related posts

బిగ్ బాస్ 4 : ఇవాళ హౌస్ లోకి అడుగు పెట్టగానే ముక్కు అవినాష్ ఏం చేయబోతున్నాడో తెలుసా?

arun kanna

భ‌ర్త‌కు బ‌ట్ట‌త‌ల ఉంద‌ని జైలుకి పంపిన భార్య.. ఎక్క‌డంటే?

Teja

Job Notification: ఇంటర్మీడియట్ తో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగం పొందండిలా..!!

bharani jella