మన భారత దేశంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చిన్న నిర్మాణం నుంచి పెద్ద ఇంటి నిర్మాణం వరకు ప్రతిదీ వాస్తు ప్రకారం నిర్మాణం చేపడతారు. అంతేకాకుండా మంచం, బీరువా, పూల కుండీలు మొదలైన వాటన్నింటినీ వాస్తు ప్రకారం ఏ ప్లేస్ లో ఎలా పెట్టాలో అక్కడ పెడతారు. అయితే వాస్తు ప్రకారం టీవీ ఎక్కడ ఎలా పెట్టాలో మీకు తెలుసా?
టీవీని కూడా వాస్తు ప్రకారం పెడితే ఎలాంటి సమస్యలు ఉండవని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కాశ్యన్ ట్విట్ చేశారు. ఏం అని చేశారంటే? వాస్తు శాస్త్రం ప్రకారం టీవీని ఈ విధంగా పెట్టడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయని, అంతేకాకుండా మనసు ఎంతో ప్రశాంతంగా మా పెద్దన్నయ్య చెప్పాడు అంటూ ట్విట్ చేశారు. టీవీ స్క్రీన్ వెనకవైపు తిప్పి ఉన్న ఫోటో పోస్టు చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారి నెటిజన్లను ఆకర్షిస్తుంది.
అయితే ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తూ వాస్తు ప్రకారం టీవీ ఇలా పెడితే ఎలాంటి సమస్యలు ఉండవు ఇది నిజమేనని అంటున్నారు. మరి కొందరు ఇంట్లో టీవీ లేకుంటే ఇంకా బాగుంటుందని కామెంట్ చేశారు. మరికొందరైతే వాస్తు ప్రకారం సెల్ ఎలా పట్టుకోవాలో, ఎలా వాడాలో చెప్పమని కామెంట్ చేశారు. ప్రవీణ్ చేసిన ఈ ట్వీట్ కొద్ది నిముషాల్లోనే వైరల్ గా మారింది. మీరు ఓసారి ట్విట్ చూసేయండి.
बड़े भाई का कहना है वास्तुशास्त्र के अनुसार टीवी को ऐसे लगाने से घर, मन और जीवन में सुख शांति बनी रहती है। pic.twitter.com/nnj6ynO50l
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 24, 2020