Vidya Balan: బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా షేర్నీ.. ఇటివల షేర్నీ సినిమా టీజర్ ను విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్..

Read More: Ardha shathabdam: అర్థ శతాబ్దం ట్రైలర్ను రిలీజ్ చేసిన హీరో నాని
సవాల్ విసిరే ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే విద్యా బాలన్ ఈ సినిమా లో నిజాయితీ గల లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అటవీ ప్రాంతంలో గ్రామస్థులను వణికిస్తున్న ఒక ఆడపులిని గుర్తించడం కోసం విద్యా బాలన్ తన టీమ్ తో కలిసి బయలుదేరినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. పులిని పట్టుకోవడం ఒక లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ వల్ల జరగదని అందరూ నిరాశ పడుతున్న సమయంలో విద్యా బాలన్ భయంకరమైన నిజాలను తెలుసుకుంటుంది ట్రైలర్ లో అర్థమవుతుంది.. ఈ సినిమా ను అమిత్ సరికొత్త విధానం లో రూపొందించాడు.. మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు.. ఈ సినిమాను టీ సీరీస్, అబండంటియా ఎంటర్టైన్మెంట్ పై నిర్మిస్తున్నారు. జూన్ 18న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.