Vijaya Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే రౌడీ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.. ఈ రౌడీ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇటీవల విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ ను బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఫాలో అవుతున్నట్లు తెలిసిందే..!! తాజాగా విజయ్ ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 12 మిలియన్ల ఫాలోవర్ లను సొంతం చేసుకున్నాడు..!!
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి కొద్ది కాలంలోనే 12 మిలియన్ ఫాలోవర్స్ లను సొంతం చేసుకున్న మొదటి దక్షిణాది హీరో గా విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం లైగర్.. ఛార్మి , కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ స్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో లైగర్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.