ట్రెండింగ్

SVP: “సర్కారు వారి పాట” పై విజయసాయిరెడ్డి రియాక్షన్..!!

Share

SVP: “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ నటించిన “సర్కారు వారి పాట” నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా విడుదల కావడంతో… “సర్కారు వారి పాట” చూడటానికి అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. దీంతో ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వచ్చినట్లూ టాక్. సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. పాటు మహేష్ మరింత గ్లామర్ గా కనిపించడం… ఇదే రీతిలో సినిమాలో అదిరిపోయే స్టెప్పులు..మహేష్ వేయడం .. మొత్తానికి హైలెట్ గా నిలిచింది. బ్యాంకులకు బడాబాబులు టోపీలు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచేయటం, అదే బ్యాంకులు రుణాలు తీసుకున్న మధ్యతరగతి పేద వాళ్ళ పై వేధింపులకు పాల్పడటం వంటి ఓ కాన్సెప్టుతో మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో కమర్షియల్ ఎంటర్టైనర్ గా పరుశురాం ఈ సినిమాని తెరకెక్కించారు.

vijaysai reddy appreciates sarkaru vaari paata concept

ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట పై వైసిపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట’ బాగుందని స‌ద‌రు ట్వీట్ లో సాయిరెడ్డి పేర్కొన్నారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారని .. తనదైన శైలిలో విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో అభినందించారు.

దీంతో విజయసాయి రెడ్డి చేసిన కామెంట్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే సమయంలో 2019 ఎన్నికల టైంలో వైసీపీ అధినేత జగన్ “నేను విన్నాను నేను ఉన్నాను” అనే నినాదాన్ని మహేష్ డైలాగ్ రూపంలో చెప్పటంతో.. జగన్ అభిమానులు భారీగా సర్కార్ వారి పాటకి మద్దతు తెలుపుతున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జగన్ గురించి మహేష్ కామెంట్ చేయడం తో.. సర్కారు వారి పాట సినిమాకి జగన్ ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఆ కంటెస్టెంట్ కి గట్టిగా హాగ్ ఇచ్చి బిగ్ కిస్ ఇచ్చిన అరియానా..!!

sekhar

Akhanda: బాలయ్య “అఖండ” సినిమాకి కూడా తప్పని తిప్పలు..??

sekhar

CBI Court: సీబీఐ కోర్టులో కీలక పరిణామం..! జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా..!!

somaraju sharma