NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

తమ పేరు బయటకు రాకూడదనే వికాస్ దుబే ఎన్ కౌంటర్..? విచారణలో సంచలన నిజాలు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు మరియు ప్రధాన గ్యాంగ్ స్టర్, కరడుగట్టిన నేరస్థుడు అయిన వికాస్ దుబే నేడు చాలా అనుమానస్పద రీతిలో పోలీసులు ఎన్ కౌంటర్ కు గురయ్యాడు. 2001లో రాష్ట్ర మంత్రి సంతోష్ శుక్లా హత్య కేసులో వికాస్ ప్రధాన నిందితుడు. అతడి కోసం అప్పటి నుండి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత 2004లో కేబుల్ వ్యాపారవేత్త దినేష్ హత్య కేసులో కూడా వికాస్ నిందితుడు.

 

A day after his arrest, UP gangster Vikas Dubey killed in police ...

ఇటీవల పోలీసులని వికాస్ హత్య చేసిన అనంతరం అతడిని నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లోని మహంకాళి ఆలయం నుండి అరెస్ట్ చేశారు. అయితే అసలు ఏడు వందల కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్ నుండి ఉజ్జయిని కి అతను ఎలా ప్రయాణం చేయగలిగాడని… పోలీసుల సహకారం లేకుండా అతను అంత దూరం వెళ్లే అవకాశమే లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. 

ఈ సమయంలో అతడి అరెస్టు పోలీసులకు మరియు అధికారపక్షానికి కొద్దిగా రిలీఫ్ ఇచ్చినా కూడా విచారణలో అతను చాలా సంచలన విషయాలను పోలీసులకు చెప్పాడు. పోలీసుల నుండే తనను కాన్పూర్ లో ఎన్ కౌంటర్ కు చేయనున్నారని తనకు ముందుగానే సమాచారం అందిందని వికాస్ విచారణలో చెప్పడం ఇక్కడ ఆశ్చర్యకరం. ఈ సమాచారంతో అప్రమత్తమైన వికాస్ మరియు అతని అనుచరులు 8మంది పోలీసులను మట్టుబెట్టారు.

పోలీసుల హత్య తరువాత అందరి మృత దేహాలను తగలబెట్టాలని అతను భావించినట్లు చెప్పాడు. మృతదేహాలను దహనం చేయడానికి ఒకే చోటకు చేర్చి పెట్రోల్ తో అంటించేందుకు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక తనపైకి మరింత బలగం వస్తోందని మరలా సమాచారం అందుకున్న తర్వాతే ఆ పనిని అక్కడే ఆపివేసి పరారయ్యానని వెల్లడించాడు. 

ఇకపోతే ఇతర పోలీసులతో సన్నిహితంగా ఉండటంపై అతను పట్టుకున్న పోలీసులు ప్రశ్నించగా అతను తనని కౌంటర్ చేస్తారన్న సమాచారం తనకి ఉదయమే అందిందని ఆ భయంతోనే అతను పోలీసులపై దాడికి దిగినట్లు చెప్పాడు. చివరికి వికాస్ కేసు ట్రయల్ కు కూడా వెల్లకుండానే పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ కావడం అది కూడా చాలా మందికి అనుమానస్పదంగా ఉండడంతో అసలు అతనికి పోలీసులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని అందరిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

author avatar
arun kanna

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju