Viral Video: కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉదయం 10 గంటల తర్వాత బయట తిరిగే వారిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది.. విచ్చలవిడిగా రోడ్డు పైకి వస్తున్న వాహనాలపై కేసు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులను.. తొమ్మిది రోజులుగా తెలంగాణలో తొమ్మిది రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉంది. ప్రధాన రహదారులు, మెయిన్ సెంటర్లలో పోలీసులు గస్తీ కాస్తున్నారు.. రోడ్లపైకి వచ్చి వారిపై చర్యలు తీసుకుంటున్నారు.. కానీ గల్లీలు, కాలనీలో జనాలు కొంతవరకు బయటకు వస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది.. దీంతో పోలీసులు కాలనీలో బయటకు వస్తున్న వారిని అదుపు చేయడం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.. ఒక కాలనీలో చిన్న పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు పోలీసు వెళ్లి ఎందుకు బయటికి వచ్చారు అని ఆ పిల్లవాడిని అడగగా.. ఆ పిల్లవాడు చిచ్చు పోసుకుంటాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

ఒక కాలనీ లో ప్రజలు బయటకి వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లగా కొంతమంది పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నారు.. పోలీస్ వెళ్ళి ఎంటి ఇక్కడ ఆడుకుంటున్నారు అని ఆ బుడ్డోడిని అడిగితే అంతలోనే ఆ బుడ్డోడు పోలీస్ ని చూసి చిచ్చు పోసుకుంటాడు.. వీళ్ళు ఒక 10నిమిషాలు ఆడుకుందాం రమంటే వచ్చాను.. ఇంకా ఎప్పుడు బయటికి రాను అని చెప్తున్నా వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ఈ వీడియో చూసిన కొంతమంది తల్లులు ఈ వీడియో చూపించి తమ పిల్లల్ని భయపెడుతున్నారు..