Vitamin B6: విటమిన్ బి6 మన శరీరానికి ఎంత అవసరమంటే..!?

Share

Vitamin B6: మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలలో విటమిన్ బి6 కూడా ఒకటి..!! విటమిన్ బి6 నే ఫైరిడాక్సిన్ అంటారు.. ఇది నీటిలో కరిగే విటమిన్.. ఇది ఫైరిడాక్సిల్, ఫైరిడామైన్, ఫైరిడాక్సిన్ మూడు రకాలుగా ఉంటుంది.. ఇది అవసరాన్ని బట్టి శరీరంలో తన రూపాలను మార్చుకుంటూ ఉంటుంది.. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మెటబాలిజం కు, ఎర్రరక్తకణాల ఉత్పత్తికి విటమిన్ బి6 చాలా అవసరం..!! విటమిన్ బి6 లోపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి..!? విటమిన్ బి6 వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Vitamin B6: విటమిన్ బి6 లోపం వలన ఈ సమస్యలు వస్తాయి..!!
విటమిన్ బి 6, బి 12 లోపించడం వలన జీర్ణ క్రియ మందగిస్తుంది. జీవ క్రియలు సరిగా పనిచేయవు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి కడుపులో మంట వేధిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ విటమిన్ లోపం వలన కంట్లో నరాలు దెబ్బ తింటాయి. కంటి చూపు తగ్గుతుంది. దృష్టి సమస్యలు తలెత్తుతాయి. కంటి సంబంధిత సమస్యలు ఎక్కువగా ఈ విటమిన్ లోపం వలన వస్తాయి. కంటి నరాల్లో క్షీణత కనిపిస్తుంది. శరీరంలో విటమిన్ బి 6 లోపిస్తే అనీమియా రావడంతో పాటు పుట్టబోయే పిల్లల్లో లోపాలు తలెత్తుతాయి. రక్త హీనత కారణం అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు వస్తాయి. పెదవులు పగులుతాయి. నోటి పూత వస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. నీరసం, నిస్సత్తువ వస్తుంది.

 

Vitamin B6: విటమిన్ బి6 వీటిలో దొరుకుతుంది..!!
చేపలు, చికెన్, మటన్ లివర్ లో విటమిన్ బి6 లభిస్తుంది పిస్తా పప్పు, అవకాడో, డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాల లో విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. తోటకూర, పాలకూర, బచ్చలి కూర, పుదీనా వంటి ఆకుకూరలలో పుష్కలంగా ఉంటుంది. ఇంకా పప్పు దినుసులు, అరటి పండ్లు లో విటమిన్ బి6 ఉంటుంది. పచ్చి శనగలు మొలకలు ఎండు మిరప లో కూడా విటమిన్ బి6 లభిస్తుంది.

Vitamin B6: విటమిన్ బి6 వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
శరీరంలో కొత్త కణాలు ఏర్పడేందుకు ఫోలిక్ యాసిడ్ భయపడుతుంది నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది జీవ క్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. విటమిన్ బి 6 ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన గుండె జబ్బులు, క్యాన్సర్, కంటి సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది.


Share

Related posts

MLA Alla Rama Krishna Reddy: టీడీపీ నేతల ఆరోపణలకు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వివరణ ఇదీ..! నిరూపించాలంటూ సవాల్..!!

somaraju sharma

Survey : పెట్రోల్ ధరల పెంపు తర్వాత సామాన్యుడి జీవితం ఎలా తయారయిందో చెప్పిన సర్వే…!

siddhu

పవన్ అభిమానులకు షాకిచ్చిన దిల్ రాజు..?

Teja