NewsOrbit
ట్రెండింగ్

ఇండియాలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ బ్యాన్.. కారణం తెలిస్తే షాక్

VLC Media Player Banned in India

అఫీషియల్ VLC వెబ్‌సైట్, డౌన్‌లోడ్ లింక్‌కు యాక్సెస్ బ్లాక్?

VLC Media Player Banned in India
ఇండియాలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ బ్యాన్

VLC Media Player Banned: బెస్ట్ మీడియా ప్లేయర్ సాఫ్ట్‌వేర్స్‌లో VLC మీడియా ప్లేయర్ ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తుందనడంలో సందేహం లేదు. ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్ పీసీలు వాడే వారందరూ కూడా VLC ప్లేయర్‌పైనే ఆధారపడుతుంటారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు కూడా ఇదొక ఫేవరెట్ మీడియా ప్లేయర్ అని చెప్పవచ్చు.

అయితే భారత ప్రభుత్వం వీఎల్‌సీ ప్లేయర్‌ను బ్యాన్ చేసి యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఐటీ చట్టం, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వీఎల్‌సీ అఫీషియల్ వెబ్‌సైట్, డౌన్‌లోడ్ లింక్‌ను బ్యాన్ చేయాలంటూ ఆదేశించింది. దాంతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటివి ఈ సైట్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేసాయి. ఫలితంగా ఇండియాలో నివసించే ఎవరూ కూడా వీఎల్‌సీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయలేరు. అలాగే వాటిలోని సర్వీసులను ఉపయోగించలేరు.

నిషేధం విధించినప్పటికీ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారు ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉపయోగించవచ్చు.

ఇండియాలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ బ్యాన్: గూగుల్, యాపిల్ స్టోర్స్‌లో బ్యాన్ కాని వీఎల్‌సీ

గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో వీఎల్‌సీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. నిషేధం విధించినప్పటికీ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారు ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉపయోగించవచ్చు.

ఎందుకంటే ఓన్లీ వీఎల్‌సీ అఫీషియల్ వెబ్‌సైట్, డౌన్‌లోడ్ లింక్‌ను మాత్రమే బ్యాన్ చేయడం జరిగింది. అందుకే ఫిబ్రవరి 13, 2022లోనే కేంద్రం దీనిపై నిషేధం విధించినా మొన్నటి దాకా ఎవరికీ తెలియలేదు. ఇదొక సాఫ్ట్ బ్యాన్‌ కాబట్టి వీఎల్‌సీని అభివృద్ధి చేసిన వీడియోలాన్ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక మన ప్రభుత్వం కూడా ఏ అధికారిక ప్రకటన వెల్లడించకపోవడం గమనార్హం.

 

వీఎల్‌సీని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటి?

Reasons for VLC Ban in India: చైనా దేశం మనకి శత్రువుగా మారిన నేపథ్యంలో చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేయడంలో ఒక అర్థం ఉంది. మరి ప్యారిస్‌కి చెందిన వీఎల్‌సీని ఎందుకు నిషేధించినట్లు? అనే సందేహం అందరిలోనూ మొదలయ్యింది. అయితే దీని వెనుక ఒక ముఖ్య కారణం ఉందని తెలుస్తోంది. చైనా మద్దతుగల సికాడా అనే హ్యాకింగ్ టీం హానికరమైన మాల్వేర్ లోడ్‌ను టార్గెటెడ్ పీసీలలో పంపించడానికి వీఎల్‌సీ ప్లేయర్‌ను ఉపయోగించింది. ఈ విషయాన్ని సైబర్ భద్రతా నిపుణులు గుర్తించి అందరికీ వెల్లడించారు. ఈ విషయం తెలిసినా కేంద్రం వీఎల్‌సీతో యూజర్లకు ముప్పు ఉంటుందనే ఉద్దేశంతో దీనిని బ్యాన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఉన్న కచ్చితమైన కారణం ఏంటనేది కేంద్రం అధికారిక ప్రకటన చేసే వరకు తెలియకపోవచ్చు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju