Sperm Count: సంతానం కలగాలంటే స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి..!? తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

Share

Sperm Count: ఈ రోజుల్లో పెళ్లి అయిన ఎక్కువ మంది వేదిస్తున్న సమస్య సంతానం..!! మహిళలతో పోల్చుకుంటే పురుషుల్లో కలుగుతున్న లోపాల వల్లే ఈ సంతాన సమస్యలు కేర్ పడుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.. ముఖ్యంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ కావలసిన సంఖ్య కంటే తక్కువగా ఉంటుందని వారు అంటున్నారు.. పండంటి బిడ్డ పుట్టాలంటే కేవలం భార్యే కాదు భర్త కూడా సరైన ఆహారం అలవాట్లు కలిగి ఉండాలని అంటున్నారు.. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత బట్టే సంతానం ఆధారపడి ఉంటుంది.. స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి..!? తగ్గడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!!

 

Sperm Count: స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..!? వీటివలనేనా..!?

పురుషుల నుంచి వచ్చే వీర్యం లోనే స్పెర్మ్ (శుక్రము) ఉంటుంది. స్పెర్మ్ ను మిలియన్స్ లో లెక్క పెడతారు. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన పురుషుడి లో ఒక మిల్లీ మీటర్ వీర్యం లో 40 నుంచి 300 మిలియన్ల స్పెర్మ్ ఉంటాయి. ఇవి 10 మిలియన్ల నుంచి 20 మిలియన్ల మధ్య ఉంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ గా చెప్పవచ్చు. స్త్రీలు గర్భం దాల్చాలంటే మగ వారు నుంచి విడుదలయ్యే స్పెర్మ్ కౌంట్ 30 మిలియన్ల కు పైగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

What is Sperm Count: and take precautions
What is Sperm Count: and take precautions

హార్మోన్ లోపల వలన ఈ సంఖ్య తగ్గుతుంది. కొంత మంది లో తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. అధిక బరువు వలన కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. మీరు కూడా కూడా సంతాన సమస్యను ఎదుర్కొంటుంటే వైద్యుల సలహా మేరకు బరువు తగ్గడానికి ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు ఖచ్చితంగా బరువు తగ్గడానికి ఎక్సర్సైజులు చేయండి. స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే విటమిన్ డి, సి, ఇ ఆహారాన్ని మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి.

What is Sperm Count: and take precautions
What is Sperm Count: and take precautions

ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్న కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అందుకని ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి. పురుగుల మందులు, పెయింట్స్, ఎండోక్రైన్ డిస్టప్టర్లు, లోహాలకు సంబంధించిన పరిశ్రమలు లో పని చేస్తుంటే ఇంటికి వెళ్ళిన వెంటనే స్నానం చేయాలి. ఎక్కువగా సైక్లింగ్ చేసే వారి లో కూడా వీటి సంఖ్య తగ్గుతుంది. అందువలన వారం లో 5 గంటల కంటే ఎక్కువ సేపు సైక్లింగ్ చేయకూడదు. వదులుగా ఉండే లో దుస్తులు మాత్రమే ధరించాలి. సింథటిక్ దుస్తులకు దూరంగా ఉండాలి.


Share

Related posts

VIRAL: రోడ్డు మీదనే పోలీస్ కి కిస్స్ పెట్టేసింది .. చూస్తోన్న జనానికి మైండ్ బ్లాక్

Ram

బిగ్ బాస్ 4: నా దృష్టిలో టైటిల్ విన్నర్ ఆతడే తేల్చేసిన తమన్నా సింహాద్రి..!!

sekhar

Bigg Boss 5 Telugu: పదవ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవటానికి నామినేట్ అయిన సభ్యుల వివరాలు..!!

sekhar