ట్రెండింగ్

Whatsapp: 2022లో రాబోతున్న వాట్సాప్ ఫీచర్లతో యూజర్లు పండగ చేసుకోండి!

Share

Whatsapp: మెసేజింగ్​ యాప్ లలో బాగా రాటుదేలునటువంటి ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్ తన యూజర్లను అబ్బుర పరచడం కోసం అదిరిపోయే ఫీచర్లను ఇపుడు విడుదల చేయబోతోంది. 2021లో విడుదలైన వాట్సాప్ ఫీచర్లను గురించి మనకు తెలిసినదే. ఇక కొద్ది రోజులలో కేలండర్ మారుతోన్న సందర్భంగా వాట్సాప్ మరిన్ని ఫీచర్స్ ను తన యూజర్స్ కోసం ప్రవేశపెట్టనుంది​. ఇపుడు ప్రముఖ సోషల్ మీడియా యాప్ లన్నీ ఆ ఫీచర్స్ కోసమే ఎదురు చూస్తున్నాయి.

Whatsapp: వాట్సాప్ లో వున్న ఈ ఆప్షన్ గురించి ఎంతమందికి తెలుసు?
ఆ ఫీచర్స్ పూర్తి సమాచారం మీకోసం..

అందులో మొదటిది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఇండికేటర్స్. ​ఈ ఫీచర్​తో వాట్సాప్ కాల్స్, స్టేటస్ మరింత సెక్యూర్ గా ఉండబోతున్నాయి. చాట్‌లతో పాటు కాల్స్, స్టేటస్‌లు సురక్షితంగా ఉంటాయని తెలియజేసే ఇండికేటర్ ఇది. ఇక రెండవది కాలింగ్ ఇంటర్‌ఫేస్. దాదాపుగా వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన సమయం నుంచి ఈ కాలింగ్ ఇంటర్‌ఫేస్ అనేది మారలేదు. దాంతో ఈ 2022లో సరికొత్త కాలింగ్ ఇంటర్‌ఫేస్ తీసుకురావాలని వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా గ్రూప్ కాల్‌ల సమయంలో యూజర్లకు ఇబ్బంది రాకుండా ఈ ఇంటర్‌ఫేస్ సాయపడుతుంది.

Whatsapp: వాట్సాప్‌లో తాజా ఫీచర్.. చాలామందికి ఇంకా తెలియనే తెలియదు!
మరిన్ని ఫీచర్లు ఇవే..

ఇక ముచ్చటగా మూడో ఫీచర్ పేరు క్విక్​ రిప్లయిస్. ఇది ముఖ్యంగా వాట్సాప్​ బిజినెస్​ అకౌంట్లలో తారసపడనుండి. ఇక నాల్గవది.. గ్రూప్ అడ్మిన్ల కోసం. అవును.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల కోసం ఒక సరికొత్త ఫీచర్​ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సాయంతో గ్రూప్‌లోని ఇతర సభ్యుల మెసేజెస్​ను ఈజీగా డిలీట్​ చేయవచ్చు. అలాగే గ్రూప్ మెంబర్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని నియంత్రించడానికి ఇది ఉపకరిస్తుంది. ఇక ఐదవ ఫీచర్ ఏమంటే.. కొత్తగా కమ్యూనిటీలను క్రియేట్​ చేసేందుకు వీలుగా యూజర్లకు ఒక ఫీచర్​ను తీసుకురాబోతోంది.


Share

Related posts

అమ్మాయిల పెళ్లి వయస్సు విషయం లో టాప్ సీక్రెట్ ఇదే !

Kumar

Intinti Gruhalakshmi: తులసి కండిషన్ కి నందు ఒప్పుకుంటాడా.!? ప్రేమ్ ఎక్కడ ఉన్నాడో అభికి తెలుసా

bharani jella

Vishnukrantha: ఈ మొక్క గురించి తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు..!!

bharani jella