WhatsApp: ప్రస్తుత సమాజంలో అందరూ కూడా వాట్సాప్ లో టాకింగ్ కంటే ఎక్కువగా చాటింగ్ కే మొగ్గు చూపుతున్నారు.అయితే ప్రస్తుతం ఈ చాటింగ్ కూడా షార్ట్ గా మారిపోతుంది. వంద పదాల్లో చెప్పే విషయాలను ఎమోజింగ్ స్టిక్కర్ల రూపంలో చెప్పేస్తున్నారు. అదేవిధంగా చెప్పాల్సిన విషయాన్ని కూడా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తున్నారు.

స్టిక్కర్లను స్వయంగా తయారు చేసుకునేందుకుగాను థార్డ్ పార్టీ యాపులను ఉపయోగిస్తున్నారు. సొంత ఫోటోలను స్టిక్కర్లుగా మార్చుకుని అవకాశం కొన్ని యాపులు కల్పించాయి. ఇదిలా ఉంటే వాట్స్అప్ ఇన్బిల్డ్ గా ఇలాంటి ఫీచర్లు అందించింది. వాట్సాప్ లోనే నేరుగా స్టిక్కర్ను తయారు చేసుకోవచ్చు. వాట్సాప్ లో స్టిక్కర్ ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం..
ఫోటోను స్టిక్కర్ గా మార్చుకోవాలి. అనుకుంటే.. ముందుగా కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయాలి. అనంతరం కాంటాక్ట్ లిస్ట్ లోకి వెళ్లి మీకు నచ్చిన కాంటాక్ట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత స్మైలీ సింబల్ పక్కన ఉన్న పేపర్ క్లిప్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత అందులో స్టిక్కర్ ఆప్షను ఎంచుకోవాలి. అదేవిధంగా స్టిక్కర్ ఆప్షన్లో ఎంచుకోగానే గ్యాలరీలో ఉన్న ఫోటోలు కనిపిస్తాయి. అందులో మీరు స్టిక్కర్ గా మార్చాలనుకుంటున్న ఫోటోను ఎంచుకోవాలి. ఆ తర్వాత వెంటనే ఫొటోస్ స్టిక్కర్ గా మారిపోతుంది. అనంతరం మీకు కావాల్సినట్లుగా ఫోటోను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించుకోవచ్చు. చివరిగా స్టిక్కర్ ని సేవ్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్ కు పంపే అవకాశాన్ని మనమే స్వయంగా తయారు చేసుకోగలం..