ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

వీల్ చైర్ తోనూ సాహ‌సాలు చేస్తున్న‌ వీరుడు!

Share

మొన‌గాడంటే.. కండ‌లు తిరిగిన దేహంతో ఉన్నోడు కాదు. అమాయ‌కుల‌ను చిత‌క బాదేటోడు అస‌లే కాదు. ఇత‌రుల‌కు సాయం చేయ‌డానికి ఎంత‌కైనా తెగించే గుణం ఉండ‌టం.. అలా ఇత‌రుల కోసం చేసే సాహ‌సంలో సంతోషాన్ని చూసుకునేటోడే నిజ‌మైన‌న మొన‌గాడు. అలాంటి వ్య‌క్తులు ఈ స‌మాజంలో కొంద‌రు ఉన్నారు. వాళ్ల‌ను చూసిన‌ప్పుడే ఇలా బ్ర‌త‌కాలిరా.. అనే ఫీల్ వ‌స్తుంది. మనం కూడా ఇలా ప‌ది మందికి సాయం చేయాల‌నే కోరిక క‌లుగుతుంది.

ఇలాంటి వ్య‌క్తే.. హాంకాంగ్‌కు చెందిన 35 ఏండ్ల‌ లై చి. లైచి 10 ఏండ్ల ముందు జరిగిన కారు యాక్సిడెంట్ వ‌ల్ల‌ వీల్‌చైర్‌కే పరిమితం అయ్యాడు. కానీన త‌ను ఏం చేయ‌లేన‌ని ఊరికే ఉండ‌లేదు. తన వీల్ ‌చైర్ ను విల్‌పవర్‌గా మార్చేసుకున్నాడు. ధైర్యసాహసాలు చేయ‌డానికి పూనుకున్నాడు. ఎంతో మంది గొప్ప‌గా చెప్పుకునే 495 మీటర్ల లైన్‌రాక్‌ పర్వతాన్ని 5 ఏండ్ల‌ క్రిత‌మే వీల్‌చైర్‌తోనే ఎక్కాడు. ఈ సాహస ప్రయాణంలో నేను హ్యాండీక్యాప్ అనే ఆలోచన ఎప్పుడూ రాలేద‌ని గొప్ప‌గా చెబుతాడు లై చి.

లైచి రాక్‌ క్లైంబింగ్‌లో నాలుసార్లు ఏషియన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇప్పుడు త‌ను మరో సాహస యాత్ర‌కు పూనుకున్నాడు. 320 మీటర్ల పొడవైన నైనా టవర్స్‌ను వీల్‌చైర్‌తోనే ఎక్కేశాడు. దీన్ని చూసిన ప‌లువురు త‌న సాహ‌సానికి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.అయితే ఈ సాహ‌సం స్పైనల్‌ కార్డ్‌ పేషెంట్ల కోసం చేస్తున్నాడు. వారికి ఉప‌యోగ‌ప‌డే నిధుల సమీకరణలో భాగంగా ఇదంతా చేస్తున్న‌ట్లు లైచి చెబుతున్నాడు.


Share

Related posts

తన మీద కామెంట్స్ చేసిన వాళ్లపై రోజా ఫైర్

Siva Prasad

స్టార్ సింగర్ ని పెళ్లి చేసుకోనున్న ప్రభాస్ హీరోయిన్!

Teja

అనుపమ అది వదలలేకపోతుందా …?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar