ధోని లాగా మీరూ కూడా ల‌క్ష‌లు సంపాదించాల‌నుకుంటున్నారా? అయితే మీరు ఇలా చేయండి..!

క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. చాలా మందిని ఇప్ప‌టికే ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టింది ఈ క‌రోనా మ‌హ‌మ్మారి. ఇప్ప‌టికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే, మీకు గ‌న‌క కొద్ధి మొత్తంలో భూమి ఉన్న మీ ఆర్థిక ఇబ్బందులు ప‌రాహుషార్ అంటూ పారిపోతాయి. మీరు కూడా ఇండియ‌న్ క్రికెట్ టీం మాజీ సార‌థి మ‌హేంద్ర సింగ్ ధోని లాగా ల‌క్షల్లో సంపాదించ‌వచ్చు.

అదేలాగా అనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ మీరు తెలుసుకోవాల్సింది ! మ‌హేంద్ర సింగ్ ధోని. దేశంలోనే కాదు యావ‌త్ ప్ర‌పంచ‌లోనే మంచి పాపుల‌ర్ సంపాదించుకున్న క్రికెట‌ర్. ఇటీవ‌లే క్రికెట్ గుడ్‌బై చెప్పిన ధోని.. వ్య‌వ‌సాయం చేయ‌డం మెద‌లు పెట్టాడు. అందులో పండించే పంట‌తో భారీగానే లాభాలు పొందుతున్నాడు. అరే ఏ పంట వేసి లాభాలు పొందుతున్నాడు? అనే క‌దా మీ ప్ర‌శ్న‌.

ఆ వివ‌రాలు మీ కోసం.. రాంచీలో మ‌హేంద్ర సింగ్ ధోనికి ఉన్న త‌న ఫామ్ హౌస్‌లో వ్య‌వ‌సాయం చేయడం ఇటీవ‌లే మొద‌లు పెట్టాడు. అందులో అత్యంత లాభ‌దాయ‌క‌మైన బ‌ఠాణీ పంట‌ను పండిస్తున్నారు. దీనికి కార‌ణం బ‌ఠాణీల‌కు మార్కెట్‌లో అధికంగా డిమాండ్ ఉండ‌టంతో పాటు దీనిని ఎక్కువ మంది తిన‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ట‌మే. బాఠాణీ పంట సాగు చేయ‌డంలో పెద్ద‌గా రిస్కు కూడా ఉండ‌దు. దీనికి తోడు వాట‌ర్ అవ‌స‌రం కూడా త‌క్కువ మొత్తంలోనే అవ‌స‌రం కావ‌డం క‌లిసోస్తుంది.

అధిక ఉష్ణోగ్ర‌త ఉన్నప్ప‌టికీ.. ధిగుబ‌డి బాగానే వ‌స్తుంది. మ‌రీ ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే నెల రోజుల‌కే పంట చేతికి వ‌స్తుంది. కాబ‌ట్టి త‌క్కువ స‌మయంలోనే మంచి దిగుబ‌డి రావ‌డంతో మంచి లాభాలు పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుతం బ‌ఠాణీ మార్కెట్ ధ‌ర‌ను గ‌మ‌నిస్తే.. ఢిల్లీ, ముంబ‌యి, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా వంటి మెట్రో న‌గ‌రాల్లో ఒక కిలో బాఠాణీల ధ‌ర రూ.60 నుంచి రూ. 80 వ‌ర‌కు ఉంటోంది. ఈ లెక్క‌న చూస్తే.. బ‌ఠాణీ సాగు చేయ‌డంతో ఒక సంవ‌త్స‌ర కాలంలో రైతుల‌కు ఏడాదిలో ల‌క్ష‌ల్లో సంపాద‌న పొంద‌వ‌చ్చు. కాబట్టి రైతులు కూడా లాభ‌దాయ‌క‌మైన బ‌ఠాణీ పంట సాగుచేయ‌డం ఉత్త‌మ‌మైన‌దిగా వ్య‌వ‌సాయ నిపుణులు సైతం సూచిస్తున్నారు. మీరు కూడా వ్య‌వ‌సాయం చేయాల‌నుకుంటే లేదా ఇదివ‌ర‌కూ వ్య‌వ‌సాయం చేసే వారు అయితే.. బ‌ఠాణీ పంట‌ను సాగు చేసి..మంచి సంపాద‌న‌ను పొందండి మారి..!